ఇక నా వల్ల కాదు! క్రికెట్ వదిలేస్తా... షాకింగ్ విషయాలు బయటపెట్టిన షాహీన్ షా ఆఫ్రిదీ...

First Published Feb 3, 2023, 1:23 PM IST

పాకిస్తాన్ తరుపున మొట్టమొదటి ఐసీసీ అవార్డు దక్కించుకున్న క్రికెటర్ షాహీన్ షా ఆఫ్రిదీ.. పాకిస్తాన్‌కి ఆశాకిరణంగా మారిన షాహీన్ ఆఫ్రిదీ, కెరీర్ ఆరంభం నుంచి గాయాలతో సతమతమవుతున్నాడు. గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన షాహీన్ ఆఫ్రిదీ, టీ20 వరల్డ్ కప్‌లో రీఎంట్రీ ఇచ్చాడు...

2018లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన 22 ఏళ్ల షాహీన్ షా ఆఫ్రిదీ, 25 టెస్టుల్లో 99 వికెట్లు తీసి 100 వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌కి వెన్నెముకగా మారిన షాహీన్ ఆఫ్రిదీ, చిన్న వయసులో క్రికెట్‌ని వదులుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడట...
 

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు షాహీన్ ఆఫ్రిదీ. ఈ సీజన్‌లో లాహోర్ ఖలందర్స్ టీమ్, ముల్తాన్ సుల్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. టోర్నీ ఆరంభానికి ముందు షాహీన్ ఆఫ్రిదీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..

‘ఎన్నో సార్లు ఇక చాలు, క్రికెట్‌ని వదిలేద్దాం అనుకున్నా... నా మోకాలి గాయం ఎంతో ఇబ్బంది పెడుతోంది. దాని నుంచి కోలుకోవడానికి ఏం చేయగలనో అన్నీ చేశా. రిహాబిటేషన్ సెషన్స్ సమయంలో కూడా నొప్పిని భరించలేక పెద్దగా అరిచేసేవాడిని...

‘ఇక నా వల్ల కాదు, ఇది చేయలేను...’ అని అవసరమైతే క్రికెట్‌ వదిలేద్దామని కూడా అనుకునేవాడిని. అయితే యూట్యూబ్‌లో నా బౌలింగ్ వీడియోలు చూసి,, ఎంత బాగా బౌలింగ్ చేశానో కదా! ఇలా మధ్యలో వదిలేస్తా ఎలా... అని నాకు నేనే మోటివేషన్ తెచ్చుకునేవాడిని..
 

world cup

ఓ ఫాస్ట్ బౌలర్ గాయంతో క్రికెట్‌కి దూరమైతే చాలా బాధగా ఉంటుంది. తిరిగి రావడానికి చేసే ప్రతీ పని ఎంతో ప్రస్టేషన్‌ని పెంచేస్తూ ఉంటుంది.. దాన్ని దాటి రావడమే చాలా పెద్ద టాస్క్...’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ యంగ్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ...

click me!