ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో ముంబై ఇండియన్స్ ఒకటి. 8 సీజన్ల గ్యాప్‌లో 5 సార్లు టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, గత 3 సీజన్లలో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్‌తో ఆఖరి స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్..
2023 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్, రెండో క్వాలిఫైయర్‌లో ఓడింది. దీంతో కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేసింది రోహిత్ శర్మ టీమ్. షేన్ బాండ్ ప్లేస్‌లో లంక మాజీ పేసర్ లసిత్ మలింగను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్..
29
గత 9 సీజన్లుగా షేన్ బాండ్, ముంబై ఇండియన్స్‌కి ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. 2023 సీజన్‌లో కుమార కార్తీకేయ, ఆకాశ్ మద్వాల్, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్ వంటి కుర్రాళ్లతోనే ప్లేఆఫ్స్ దాకా వెళ్లగలిగింది ముంబై ఇండియన్స్.
39
2021 సీజన్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకున్న లసిత్ మలింగ, 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మారాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ ముంబై ఇండియన్స్‌లోకి తిరిగి వచ్చాడు లసిత్ మలింగ..
49
ముంబై ఇండియన్స్ తరుపున 139 ఐపీఎల్ మ్యాచులు ఆడిన మలింగ, 7.12 ఎకానమీతో 195 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 170 వికెట్లు తీసి 2021 వరకూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు లసిత్ మలింగ. అతని రికార్డును డ్వేన్ బ్రావో, యజ్వేంద్ర చాహాల్ అధిగమించారు.
59
ఐపీఎల్ 2022 మెగా వేలంలో స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేయకుండా ముంబై ఇండియన్స్ చేసిన తప్పిదం, ఆ టీమ్ పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపింది. 14 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుని 10 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్...
69
2023 సీజన్‌లో గాయంతో జస్ప్రిత్ బుమ్రా తప్పుకోవడం, జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ ఇచ్చినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. 5 మ్యాచులు ఆడి 2 వికెట్లు మాత్రమే తీసిన ఆర్చర్, గాయం తిరగబెట్టడంతో చాలా మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు..
79
ఐపీఎల్ 2024 సీజన్‌లో జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ ఇద్దరూ ఆడే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఫిట్‌గా ఉండి, అన్ని మ్యాచులు ఆడితే మాత్రం ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2024 సీజన్‌లో రచ్చ లేపడం ఖాయం..
89
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. బౌలింగ్ ఫెయిల్యూర్ కారణంగా ముంబై గత 3 సీజన్లలో టైటిల్ నెగ్గలేకపోయింది.
99
Mumbai Indians
లసిత్ మలింగ కోచింగ్‌లో జోఫ్రా ఆర్చర్, జస్ప్రిత్ బుమ్రా అండ్ కో.. ఎలా రాణిస్తారోనని ఇప్పటి నుంచే ఆశగా ఎదురుచూస్తున్నారు ముంబై ఇండియన్స్ అభిమానులు...