విరాట్ కోహ్లీ, ఇదేందయ్యా ఇది... రెండు మ్యాచుల్లో ఒకే స్కోరు, బంతులు, అవుట్ కూడానా...

First Published Apr 14, 2021, 10:34 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ను విజయంతో ఆరంభించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ గెలిచిన ఆర్‌సీబీ, రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలబడుతోంది... అయితే ఈ మ్యాచ్‌లో ఓ యాదృచ్ఛిక విచిత్రం జరిగింది...

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 29 బంతుల్లో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ... సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా సరిగ్గా 29 బంతుల్లో 33 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు కోహ్లీ...
undefined
అంతేకాదు మొదటి మ్యాచ్‌లో నాలుగు ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ, నేటి మ్యాచ్‌లో కూడా సరిగ్గా నాలుగే ఫోర్లు బాది అవుట్ అయ్యాడు. అంతేకాదు రెండు మ్యాచుల్లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యింది 13వ ఓవర్‌లోనే...
undefined
ఇంతకుముందు 2015 ఐపీఎల్‌లో వరుసగా రాజస్థాన్ రాయల్స్‌, సీఎస్‌కేలపై 12 పరుగులకి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. అయితే అప్పుడు ఆడిన బంతుల్లో తేడా ఉంది. ఇప్పుడు మాత్రం స్కోరు, బంతులు, అవుట్ అయిన ఓవర్ కూడా సేమ్ టు సేమ్...
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో నేటి మ్యాచ్‌లో చేసిన 33 పరుగులే విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు. మిగిలిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో 12, 3, 16, 14, 7, 6 పరుగులకే పెవిలియన్ చేరాడు కోహ్లీ...
undefined
మరోవైపు గత సీజన్‌లో ఒక్క సిక్సర్ కూడా బాదలేకపోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, 2021 సీజన్‌ మొదటి రెండు మ్యాచుల్లో కలిపి 5 సిక్సర్లు బాదాడు...
undefined
అంతేకాదు 2017 నుంచి వరుసగా నాలుగు సీజన్లలో ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ బాదలేకపోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, 2016 తర్వాత మళ్లీ తొలిసారిగా ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు...
undefined
2014 ఐపీఎల్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన మ్యాక్స్‌వెల్, 2016లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత 2021లోనే గ్లెన్ మ్యాక్స్‌వెల్ నుంచి అర్ధశతకం వచ్చింది...
undefined
click me!