గ్లెన్ మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ... సన్‌రైజర్స్ ముందు ఊరించే టార్గెట్...

Published : Apr 14, 2021, 09:15 PM IST

గత సీజన్‌లో ఒక్క సిక్స్ కొట్టకపోయినా గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ.14కోట్ల 25 లక్షల భారీ ధర చెల్లించి కొనుగోలు చేసిన ఆర్‌సీబీకి హాఫ్ సెంచరీతో మంచి గౌరవప్రదమైన స్కోరు అందించాడు బిగ్‌షో...  టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగుల స్కోరు చేసింది... 

PREV
19
గ్లెన్ మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ... సన్‌రైజర్స్ ముందు ఊరించే టార్గెట్...

13 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ బౌలింగ్‌లో నదీమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆర్‌సీబీ...

29

10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన షాబద్ అహ్మద్, షాబద్ నదీం బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్.

39

విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కలిసి మూడో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో 29 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

49

గత మ్యాచ్‌లో కూడా విరాట్ కోహ్లీ సరిగ్గా 29 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసి 13వ ఓవర్ మొదటి బంతికే పెవిలియన్ చేరడం మరో విశేషం...

59

గత మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలిచిన ఏబీ డివిల్లియర్స్, 5 బంతుల్లో కేవలం ఒకే పరుగు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

69

ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. డానియల్ క్రిస్టియన్‌ను 1 పరుగుకే పెవిలియన్ చేర్చాడు నటరాజన్...

79

109 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును జెమ్మీసన్, మ్యాక్స్‌వెల్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 20వ ఓవర్ మొదటి బంతికే 9 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన జెమ్మీసన్‌ను అవుట్ చేశాడు హోల్డర్...

89

ఓవైపు వికెట్లు పడుతున్నా బౌండరీలు బాదుతూ దూకుడు కొనసాగించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు.

99

జాసన్ హోల్డర్‌కి మూడు వికెట్లు దక్కగా, రషీద్ ఖాన్ రెండు... భువనేశ్వర్ కుమార్, నదీం, నటరాజన్ చెరో వికెట్ తీశారు. 

click me!

Recommended Stories