సందీప్ శర్మ ఎందుకు పక్కనబెట్టినట్టు... విరాట్‌ కోహ్లీపై తిరుగులేని రికార్డు...

First Published Apr 14, 2021, 7:58 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నా... టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడని ప్లేయర్ సందీప్ శర్మ.  ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్‌కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీపై తిరుగులేని రికార్డు ఉంది...

ఐపీఎల్‌లో విరాట్‌‌ని ఏడు సార్లు అవుట్ చేసిన సందీప్ శర్మ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోహ్లీని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా టాప్‌లో ఉన్నాడు. ఆశీష్ నెహ్రా ఆరుసార్లు, బుమ్రా నాలుగు సార్లు మాత్రమే కోహ్లీ వికెట్ తీశారు...
undefined
సందీప్ శర్మ బౌలింగ్‌లో ఐపీఎల్‌లో 72 బంతులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, కేవలం 55 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఏడుసార్లు అవుట్ అయ్యాడు...
undefined
పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా టాప్‌లో ఉన్నాడు సందీప్ శర్మ... సందీప్ శర్మ, ఐపీఎల్ కెరీర్‌లో 92 ఇన్నింగ్స్‌ల్లో 53 వికెట్లు తీయగా... 99 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు...
undefined
మరో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్... 123 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీసి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఉన్నాడు..
undefined
గత సీజన్‌లో డుప్లిసిస్‌ను డకౌట్ చేసిన బౌలర్‌గా నిలిచిన సందీప్ శర్మ, 2020లో 13 మ్యాచులు ఆడి 14 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో 7.19 ఎకానమీతో బౌలింగ్ చేసి, సన్‌రైజర్స్‌కి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.
undefined
విరాట్ కోహ్లీపై తిరుగులేని రికార్డు ఉన్న సందీప్ శర్మను, ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పక్కనబెట్టడంపై డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి.
undefined
సందీప్ శర్మ గాయంతో బాధపడుతూ ఉండొచ్చని లేకపోతే, విరాట్ కోహ్లీని ఇబ్బందిపెట్టే అతన్ని తుదిజట్టు నుంచి ఎందుకు తప్పిస్తారని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి...
undefined
ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటిదాకా 93 మ్యాచులు ఆడిన సందీప్ శర్మ, 109 వికెట్లు తీశాడు. ఎకానమీ 7.75 మాత్రమే... అయినా టీమిండియా సెలక్టర్ల దృష్టిలో మాత్రం పడడం లేదు సందీప్ శర్మ...
undefined
click me!