టీమిండియాలో ఫిట్టెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాదా? యో-యో టెస్టులో బెస్ట్ స్కోరు ఎవరిదంటే..

Published : Aug 24, 2023, 04:58 PM IST

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా మారిన తర్వాత టీమ్‌లో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెరిగింది. విరాట్ కోహ్లీతో పాటు జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా అండ్ కో సిక్స్ ప్యాక్ బాడీలతో దర్శనం ఇచ్చారు. 

PREV
16
టీమిండియాలో ఫిట్టెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాదా? యో-యో టెస్టులో బెస్ట్ స్కోరు ఎవరిదంటే..
Virat Kohli

తాజాగా ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు యో-యో టెస్టులో పాల్గొన్న విరాట్ కోహ్లీ... తన స్కోరును బయటపెట్టాడు. ఇంతకుముందు యో-యో టెస్టులో 19 పాయింట్లు సాధించిన విరాట్ కోహ్లీ, ప్రస్తుత టెస్టులో 17.2 పాయింట్లు మాత్రమే తెచ్చుకోవడం విశేషం..

26

యో- యో టెస్టులో బెస్ట్ స్కోరు సాధించిన టీమిండియా క్రికెటర్లు వీరే. రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా... ఈ ఇద్దరూ ఆల్‌రౌండర్లు, యో-యో టెస్టులో అత్యుత్తమంగా 19 పాయింట్లు సాధించారు.. అయితే ప్రస్తుతం వీరి స్కోరు ఎంత అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు..

 

36

రవీంద్ర జడేజా కొన్నేళ్లుగా వరుస గాయాలతో బాధపడుతుంటే, వెన్నెముక సర్జరీ తర్వాత హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్ స్టాండర్డ్స్ పూర్తిగా తగ్గిపోయాయి. 

 

46
Manish Pandey

టీమిండియాలో బెస్ట్ యో-యో స్కోరు సాధించిన ప్లేయర్ మనీశ్ పాండే. అప్పుడెప్పుడో 2021లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మనీశ్ పాండే, యో-యో టెస్టులో అత్యధికంగా 19.2 పాయింట్లు సాధించాడు..

56

ఇప్పటిదాకా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్రికెటర్, స్పిన్ బౌలర్ మయాంక్ దగర్, యో-యో టెస్టులో 19.3 పాయింట్లు సాధించి... బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశారు. ఈ మయాంక్ దగర్, వీరేంద్ర సెహ్వాగ్‌కి మేనల్లుడు కూడా..
 

66


పాక్ క్రికెటర్ షాన్ మసూద్, యో-యో టెస్టులో 22.1 పాయింట్లు సాధించి, ప్రస్తుత తరంలో అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్‌గా ఉన్నాడు. జానీ బెయిర్‌స్టో 21.8 పాయింట్లతో తర్వాతి పొజిషన్‌లో ఉన్నాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories