ధోనీ కొట్టిన ఒక్క సిక్సర్‌తో వరల్డ్ కప్ వచ్చేయలేదు! వాళ్లు అసలైన వరల్డ్ కప్ విన్నర్లు.. - గౌతమ్ గంభీర్

Published : Aug 24, 2023, 04:09 PM IST

1983లో ఎలాంటి అంచనాలు లేకుండా వన్డే వరల్డ్ కప్ ఆడిన భారత జట్టు, కపిల్ దేవ్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచింది. ఇది జరిగిన 20 ఏళ్లకు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా, 2003 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవలేకపోయింది. మళ్లీ 2011లో ప్రపంచ కప్ సాధించింది టీమిండియా...

PREV
18
ధోనీ కొట్టిన ఒక్క సిక్సర్‌తో వరల్డ్ కప్ వచ్చేయలేదు! వాళ్లు అసలైన వరల్డ్ కప్ విన్నర్లు.. - గౌతమ్ గంభీర్

2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత జట్టు, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో నెగ్గింది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై సునాయస విజయం అందుకుంది..

28

2011 వన్డే వరల్డ్ కప్‌లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో 482 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా 2011 వరల్డ్ కప్‌లో 500 పరుగులు చేసిన దిల్షాన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ సచిన్ టెండూల్కరే.

38

గౌతమ్ గంభీర్ 393, వీరేంద్ర సెహ్వాగ్ 380, యువరాజ్ సింగ్ 362 పరుగులు చేశారు. టీమిండియా నుంచి టాప్ 10లో నలుగురు బ్యాటర్లు ఉంటే, శ్రీలంక నుంచి ముగ్గురు దిల్షాన్ (500), సంగర్కర (465), ఉపుల్ తరంగ (395) ఉన్నారు. ఇంగ్లాండ్ నుంచి జొనాథన్ ట్రాట్ (422), ఆండ్రూ స్ట్రాస్ (334), సౌతాఫ్రికా నుంచి ఏబీ డివిల్లియర్స్ (353) మాత్రమే టాప్‌ 10లో చోటు దక్కించుకోగలిగారు.

48

‘భారత్‌లో వ్యక్తి పూజ చాలా ఎక్కువ. ఎందుకంటే సమిష్టిగా పోరాడితేనే విజయం వస్తుందని నమ్మేవారే కంటే ఏ ఒక్క ప్లేయర్ వల్లే మ్యాచులు గెలవగలం అనుకునేవాళ్లే ఎక్కువ. కోహ్లీ అయినా, రోహిత్ అయినా ఒంటరిగా టోర్నీలు గెలిపించలేరు. ఏదో ఒక్క మ్యాచ్‌లో అలా ఆడి గెలిపించవచ్చేమో, టోర్నీ గెలవాలంటే మాత్రం టీమ్‌ మొత్తం కలిసి ఆడాలి..

58

2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో నేను చేసిన 97 పరుగుల గురించి వదిలేయండి. అయితే యువరాజ్ సింగ్ చేసిన దానికి అతనికి దక్కాల్సినంత క్రెడిట్ దక్కలేదు. ఆల్‌రౌండర్‌గా అతను బ్యాటుతో, బంతితో అదరగొట్టి, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచాడు. అయితే అది ఎవ్వరికీ గుర్తు లేదు..

68

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో జహీర్ ఖాన్ వేసిన ఫస్ట్ స్పెల్ సెన్సేషనల్. భారత జట్టు విజయానికి అదే అసలైన పునాది. అలాగే మునాఫ్ పటేల్, సురేష్ రైనా... ఆఖరికి సచిన్ టెండూల్కర్, 2011లో టీమిండియాకి టాప్ స్కోరర్. ఆయనకి కూడా వరల్డ్ కప్ విజయంలో దక్కాల్సినంత క్రెడిట్ దక్కలేదు.. వాళ్లే అసలైన వరల్డ్ కప్ విన్నర్స్.. 

78

జనాలు కానీ, మీడియా కానీ 2011 వన్డే వరల్డ్ కప్ గురించి మాట్లాడితే ఫైనల్ మ్యాచ్‌లో మాహీ కొట్టిన ఒక్క సిక్సర్ గురించే చెబుతారు. ఆ ఒక్క సిక్సర్ కొడితే వరల్డ్ కప్ ఎవ్వరూ ఇవ్వరనే విషయం ఎందుకు గుర్తించలేకపోతున్నారు...

88

కావాలంటే నేను కూడా అలా సిక్సర్లు కొట్టేవాడిని. అయితే నాకు నా దేశాన్ని గెలిపించడమే ముఖ్యం. క్రెడిట్ కొట్టేయడం కాదు. ఆ రోజు మేమంతా దేశం కోసం గెలవాలనుకున్నాం. గెలిచాం. నేను దేశానికి ఆడిన ప్రతీ మ్యాచ్ ఇలాగే అనుకున్నా. నా కోసం, నాకు క్రెడిట్ దక్కడం కోసం ఎప్పుడూ ఏ రోజు ఆడలేదు..’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్.. 

click me!

Recommended Stories