మా టీమ్‌ని చూసి జనాలు భయపడుతున్నారు... పాక్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ షాకింగ్ కామెంట్స్...

Published : Aug 24, 2023, 03:41 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఇండియా, ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్ ప్లేయర్ల నుంచి ఎలాంటి కామెంట్లు రాకపోయినా.. పాకిస్తాన్ ప్లేయర్లు మాత్రం మైండ్‌గేమ్ మొదలెట్టేశారు. మా టీమ్‌ని చూసి మిగిలిన టీమ్స్‌ భయపడుతున్నాయని షాకింగ్ కామెంట్లు చేశాడు పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్...

PREV
16
మా టీమ్‌ని చూసి జనాలు భయపడుతున్నారు... పాక్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ షాకింగ్ కామెంట్స్...

ఆసియా కప్ 2023 టోర్నీలో సెప్టెంబర్ 2న ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత సూపర్ 4లో మరోసారి, కుదిరితే ఫైనల్‌లోనూ ఇండియా, పాకిస్తాన్‌తో తలబడనుంది..

26
Rohit Sharma-Babar Azam

ఆసియా కప్ ముగిసిన తర్వాత ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అక్టోబర్ 14న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఆసియా కప్ కంటే ఎక్కువగా ఈ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్...

36

‘నేను ఇప్పటికైతే ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ గురించి ఆలోచించాలని అనుకుంటున్నా. వన్డే వరల్డ్ కప్ గురించి ఆలోచించకూడదనే అనుకుంటున్నా. అయినా నా ఆలోచన అంతా అక్కడికే వెళ్తోంది. మానసికంగా, శారీరకంగా నేను వన్డే వరల్డ్ కప్ కోసం అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నా..

46
Babar Azam

నిజం ఏంటంటే పాకిస్తాన్ వన్డే టీమ్‌ని చూసి జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే మేం అద్భుత విజయాలు అందుకున్నాం. మాకు పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉంది. అలాగే వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్నారు. వన్డేల్లో మా టీమ్ బెస్ట్‌‌గా ఉందని నమ్ముతున్నాం..
 

56

నేను ఇప్పటిదాకా 60 వన్డేలు ఆడాను. ఫకార్ 70 ఆడాడు, బాబర్ ఆజమ్ 100 దాకా మ్యాచులు ఆడాడు. నసీం, షాహీన్, హారీస్, వసీం జూనియర్, షాదబ్, నవాజ్, ఒసామా మీర్, ఇఫ్తికర్ అమ్మద్, సల్మాన్ ఆలీ అఘా, రిజ్వాన్.. ఇలా మా టీమ్‌లో అందరూ మ్యాచ్ విన్నర్లే..

66
imam ul haq

నేను టీమ్‌లో ఉన్నాను కాబట్టి మా టీమ్ బలంగా ఉందని చెప్పడం లేదు. నేను టీమ్‌లో లేకపోయినా ఈ టీమ్‌ని స్ట్రాంగ్ టీమ్‌గా ఒప్పుకునేవాడిని. మాకు ప్రతీ రోల్‌పై క్లారిటీ ఉంది. ఈజీగా వరల్డ్ కప్ గెలువగలమని నమ్ముతున్నాం..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్.. 

click me!

Recommended Stories