పేలవ ఫామ్ తో కెరీర్ ప్రమాదంలో పడ్డ విరాట్ కోహ్లికి వరుస షాకులు తాకుతున్నాయి. ఇప్పటికే విండీస్ తో వన్డే సిరీస్ కు అతడికి విశ్రాంతినెందుకిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో తాజాగా అతడికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
27
Image credit: Getty
గజ్జల్లో గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేకు దూరమైన కోహ్లి డగౌట్ కే పరిమితమయ్యాడు. అయితే తాజాగా అతడు రెండో వన్డేలో కూడా ఆడేది అనుమానమే అని తెలుస్తున్నది.
37
Image credit: Getty
గురువారం లార్డ్స్ వేదికగా జరుగబోయే రెండోవన్డేలో కూడా కోహ్లీ ఆడటం అనుమానమే అని టీమిండియా వర్గాలు తెలిపాయి. ఇదే విషయమై మంగళవారం ఇంగ్లాండ్ తో మ్యాచ్ ముగిశాక నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ.. కోహ్లి గాయం గురించి తనకు తెలియదని చెప్పాడు.
47
Image credit: Getty
బుమ్రా స్పందిస్తూ.. ‘కోహ్లీ గాయం గురించి నాకు సమచారం తెలియదు. ఎందుకంటే నేను మూడో టీ20 ఆడలేదు. అతడు కోలుకుంటాడనే నమ్ముతున్నా. కానీ వాస్తవంగా అతడి గాయం గురించిన అప్టేడ్ మాత్రం నాకైతే తెలియదు..’ అని తెలిపాడు.
57
తొలి వన్డేలో కోహ్లీకి గాయం కావడంతో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. అయితే నిన్నటి మ్యాచ్ లో అతడికి ఆడే అవకాశమే రాలేదు. ఒకవేళ కోహ్లీ రెండో వన్డే ఆడకుంటే టీమ మేనేజ్మెంట్ మాత్రం అయ్యర్ నే కొనసాగించే అవకాశముంది.
67
ఇక మంగళవారం ముగిసిన తొలి వన్డేలో ఇంగ్లాండ్.. బుమ్రా దెబ్బకు విలవిల్లాడింది. అతడు 7.2 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టగా మహ్మద్ షమీ 3, ప్రసిధ్ కృష్ణ ఒకవికెట్ తీసుకున్నారు. ఫలితంగా ఇంగ్లాండ్.. 110 పరుగులకే ఆలౌట్ అయింది.
77
Image credit: Getty
లక్ష్య ఛేదనలో భారత జట్టు 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదిపారేసింది. టీమిండియా సారథి రోహిత్ శర్మ (76 నాటౌట్), శిఖర్ ధావన్ (31 నాటౌట్) లు సంయమనంతో ఆడి భారత్ కు పది వికెట్ల విజయాన్నిఅందించారు.