పాకిస్తాన్ ను కిందకు నెట్టిన టీమిండియా.. ఇంగ్లాండ్ పై విజయంతో ర్యాంకుల్లో బూస్ట్

Published : Jul 13, 2022, 11:45 AM IST

ICC Rankings: ఇంగ్లాండ్ తో మంగళవారం ముగిసిన తొలి  వన్డేలో భారత్ 10 వికెట్ల  తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో  భారత జట్టు ర్యాకింగ్స్ లో ముందడుగు వేసింది. 

PREV
17
పాకిస్తాన్ ను కిందకు నెట్టిన టీమిండియా.. ఇంగ్లాండ్ పై విజయంతో ర్యాంకుల్లో బూస్ట్
Team India

ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన టీ20ల మాదిరిగానే  వన్డేల్లో కూడా శుభారంభం చేసింది టీమిండియా.  టీ20సిరీస్ ను 2-1 తో చేజిక్కించుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో  నిలిచింది. ‘ది ఓవల్’ వేదికగా  మంగళవారం ముగిసిన తొలి వన్డేలో  పది వికెట్ల తేడాతో గెలుపొందింది. 

27

తాజా విజయంతో భారత జట్టు  వన్డే ర్యాంకింగ్స్ లో ముందడుగు వేసింది. అంతేగాక ఇటీవలే  మనను వెనక్కినెట్టిన పాకిస్తాన్ ను  కిందకు తోసింది.  వన్డే ర్యాంకులను ఐసీసీ తాజాగా వెలువరించింది. 

37

ఇంగ్లాండ్ పై తొలి వన్డేలో విజయంతో భారత జట్టు ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి చేరింది.  అగ్రస్థానాన్ని  న్యూజిలాండ్ (126 రేటింగ్) దక్కించుకోగా.. ఇంగ్లాండ్ రెండో స్థానం (122 ) ఉంది. భారత జట్టు  108 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరింది. 

47

ఈ మ్యాచ్ కు ముందు భారత జట్టు  104 రేటింగ్ పాయింట్లతో నాలుగోస్థానంలో ఉండేది. పాకిస్తాన్ కు 106  పాయింట్లు  ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత జాబితాలో ఆస్ట్రేలియా (101), సౌతాఫ్రికా (99), బంగ్లాదేశ్ (96), శ్రీలంక (92), వెస్టిండీస్ (71), అఫ్ఘనిస్తాన్ (69), ఐర్లాండ్(54) ఉన్నాయి. 

57

భారత్ ఇంగ్లాండ్  తో జరుగుతున్న మిగిలిన రెండు మ్యాచులలో  ఒకటి నెగ్గి ఒకటి ఓడినా మూడోర్యాంకుకు వచ్చిన ప్రమాదమేమీ  లేదు. పాకిస్తాన్ కు ఇప్పుడప్పుడే ఆడటానికి వన్డేలు కూడాలేవు. 

67

 ఇక ఇంగ్లాండ్ తో సిరీస్ ను ఇదే జోష్ లో నెగ్గి.. ఆ తర్వాత వెస్టిండీస్ తో కూడా ఇదే ఊపు కొనసాగిస్తే టీమిండియా టాప్-2 (ఇంగ్లాండ్) కు గురిపెట్టే అవకాశాలుంటాయి. 

77

కాగా మూడు ఫార్మాట్లలో టాప్-3 గా ఉన్న జట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధించింది. వన్డేలలో 3వ ర్యాంకులో ఉన్న భారత జట్టు.. టెస్టులలో రెండో స్థానంలో ఉంది. టీ20లలో భారత జట్టు ప్రథమస్థానంలో నిలిచింది.  ఇలా మూడు ఫార్మాట్లలో టాప్-3లో ఉన్న జట్లు మరొకటి లేకపోవడం  గమనార్హం. 
 

Read more Photos on
click me!

Recommended Stories