డైపర్లు మార్చడం నేర్చుకుంటున్నా... అప్పుడు కూడా మ్యాచ్ చూస్తున్నా... భారత సారథి విరాట్ కోహ్లీ...

First Published Feb 5, 2021, 3:49 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీ జనవరి 11న ఓ ఆడబిడ్డకు తండ్రి అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తమ కూతురికి ‘వామిక’ అని నామకరణం కూడా చూశాడు. తండ్రి అయిన తర్వాత తొలిసారి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ... తొలి టెస్టు ప్రారంభానికి ముందు మీడియాతో ముచ్ఛటించాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు ప్రకటించాడు కోహ్లీ...

‘నేను జట్టుకి దూరంగా ఉన్నా, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ మొత్తం లైవ్ చూస్తూనే ఉన్నా. నాకు క్లియర్‌గా గుర్తుంది. అనుష్కను డెలివరీ కోసం డాక్టర్ పిలిచేముందు కూడా గబ్బా టెస్టులో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ చేస్తూ భాగస్వామ్యాన్ని మొబైల్‌లో చూస్తూ ఉన్నాను...
undefined
నేను జట్టుతో అంతలా కనెక్ట్ అయ్యాను. మొదటి టెస్టు తర్వాత జట్టు మొత్తం కలిసి సమిష్టిగా కమ్‌బ్యాక్ ఇచ్చిన విధానం చూసి గర్వంగా అనిపించింది. ఆస్ట్రేలియాలో దక్కిన విజయంలో క్రెడిట్ జట్టులోని సభ్యులందరికీ దక్కుతుంది...
undefined
ఇలాంటి విజయం ఇంతకుముందెప్పుడూ దక్కలేదని నేను చెప్పను, కానీ నమ్మకం, అంకితభావంతో పట్టువదలకుండా విజయాన్ని సాధించడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. క్రికెట్ ఫ్యాన్స్ గుండెల్లో ఈ విజయం చిరకాలం నిలిచిపోతుంది.
undefined
ప్రస్తుతం టెస్టు ఛాంపియన్‌షిప్ గురించి మేం ఆలోచించడం లేదు. ప్రస్తుతానికి ఈ మ్యాచ్ గురించే ఆలోచిస్తున్నాం... టెస్టు సిరీస్ ముగిసిన తర్వాతే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ గురించి ఆలోచిస్తాం... అప్పటిదాకా దాని గురించి ఆలోచించాలని అనుకోవడం లేదు.
undefined
తండ్రి అవ్వడం చాలా అద్భుతమైన ఫీలింగ్. పిల్లల డైపర్స్ ఎలా మార్చుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నా... నా జీవితంలో క్రికెట్‌కి ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో, వ్యక్తిగత జీవితానికి కూడా అంతే ఇవ్వాలని అనుకుంటున్నా... ’ అంటూ స్పష్టం చేశాడు విరాట్ కోహ్లీ...
undefined
click me!