‘సారీ షరపోవా...’ టెన్నిస్ స్టార్‌కి క్షమాపణల వర్షం కురిపిస్తున్న మలయాళీలు... ఆనాడు సచిన్ విషయంలో...

First Published | Feb 5, 2021, 12:27 PM IST

‘సారీ షరపోవా...’ ఇప్పుడు మాజీ టెన్నిస్ స్టార్ షరపోవా... సోషల్ మీడియా అకౌంట్లలో ఇప్పుడు కురుస్తున్న కామెంట్ల వర్షం ఇది... కొన్ని వందల మంది మలయాళీలు, ఇతర రాష్ట్రాల వాళ్లు రష్యన్ టెన్నిస్ స్టార్‌కి కామెంట్ల ద్వారా క్షమాపణలు చెబుతున్నారు... కారణం దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన. అప్పుడు వాళ్లు కరెక్టు అనుకుని చేసింది, ఇప్పుడు వారికి రాంగ్ అనిపించింది... అందుకే షరపోవాకి సారీల ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి...

సచిన్ టెండూల్కర్... భారతదేశంలో క్రికెట్‌కి ఇంతటి క్రేజ్, పాపులారిటీ రావడానికి ప్రధాన కారణం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ మొదలెట్టిన తర్వాతే, ఆ ఆట గురించి తెలుసుకున్నవారు, క్రికెట్ చూసినవాళ్లు, సచిన్‌లా అవ్వాలని ఆడినవాళ్లు, ఆడి టీమిండియాలోకి వచ్చినవాళ్లు ఎందరో ఉన్నారు. అయితే ఓ చిన్న ఇష్యూలో వేలు పెట్టడంతో నాలుగు దశాబ్దాలుగా క్రికెట్ దిగ్గజం సాధించినదంతా చిన్నదైపోయింది...
undefined
హాలీవుడ్ స్టార్, ‘హ్యారీ పోటర్’ హీరో డానియల్ రాడ్‌క్లిఫ్ కూడా సచిన్ టెండూల్కర్‌కి వీరాభిమానియే. సచిన్ టెండూల్కర్ ఆటోగ్రాఫ్ కోసం ఓ సారి క్యూలో నిల్చున్నానని స్వయంగా ప్రకటించాడు డానియల్ రాడ్‌క్లిఫ్. అలాంటి సచిన్ టెండూల్కర్ ఎవరో తెలియదని 2014లో కామెంట్ చేసింది రష్యా టెన్నిస్ ప్లేయర్ మారియా షరపోవా. దాంతో సచిన్ అభిమానులు, ఆమెను తిడుతూ, ట్రోల్ చేస్తూ తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు...
undefined

Latest Videos


భారతీయులకు ప్రేమొచ్చనా, కోపం వచ్చినా ఆగదనే విషయం తెలిసిందే. వరల్డ్ కప్ విజయం తర్వాత మహేంద్ర సింగ్ ధోనీని పొడుగుతూ నెత్తిన పెట్టుకున్న టీమిండియా ఫ్యాన్స్, వన్డే వరల్డ్‌కప్‌లో అతని రనౌట్ తర్వాత తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఈ రకమైన ట్రోలింగ్ ఎదుర్కున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...
undefined
తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతుల గురించి అమెరికన్ పాప్ సింగర్ రిహానా ట్వీట్ చేయడం, దానిపై సచిన్ టెండూల్కర్ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. ‘అంతర్గత విషయాలలో బయటివారి జోక్యం సహించబోమంటూ’ సచిన్ టెండూల్కర్ వేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. సచిన్ టెండూల్కర్‌ను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తూ ట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...
undefined
కొందరు సచిన్ టెండూల్కర్, భారత ప్రభుత్వం తరుపున బ్యాటింగ్ చేస్తున్నారని పోస్టులు చేస్తుంటే... మరికొందరు ఆయన కులాన్ని, మతాన్ని లేవనెత్తి తీవ్రస్థాయిలో దూషణలకు దిగుతున్నారు. ఇదే సమయంలో ఏడేళ్ల క్రితం మారియా షరపోవా చేసిన వ్యాఖ్యలు వారికి గుర్తుకు వచ్చాయి... దీంతో ఆమెకు క్షమాపణలు చెబుతున్నారు.
undefined
రైతులకు మద్ధతుగా నిలుస్తూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నవారిలో కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళీలే ఎక్కువమంది ఉన్నారు. వాళ్లే మారియా షరపోవాకు సారీ చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఏడేళ్ల క్రితం జరిగిన దానికి ఫీల్ అయ్యిందో లేదో తెలీదు కానీ ఇప్పుడు తనకు వస్తున్న ‘సారీ... మేడం’ కామెంట్లను చూసి ఆశ్చర్యపోతోంది షరపోవా...
undefined
‘ఎవ్వరైనా నాలాగే కొన్నేళ్ల తర్వాత అయోమయానికి గురయ్యారా?’ అంటూ ట్వీట్ చేసింది మారియా షరపోవా... సచిన్ టెండూల్కర్ తన ట్వీట్‌లో రైతుల మద్ధతుగా ఉన్నానని కానీ, లేను అని కానీ చెప్పకపోయినా... జోక్యం అవసరం లేదని చెప్పినందుకు ఇంతగా టార్గెట్ చేయడం ఏంటని నిలదీస్తున్నారు కొందరు ‘క్రికెట్ గాడ్’ వీరాభిమానులు.
undefined
click me!