ఇషాంత్ శర్మను ఎందుకు తీసుకున్నారు... కుల్దీప్‌ను ఎందుకు పక్కనబెట్టారు... గంభీర్ కామెంట్...

Published : Feb 05, 2021, 01:54 PM IST

ఆస్ట్రేలియా టూర్‌లో మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచిన మహ్మద్ సిరాజ్‌కి మొదటి టెస్టులో చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. అలాగే ఆసీస్ టూర్‌లో చోటు దక్కించుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్‌కి తుదిజట్టులో చోటు కల్పించాల్సిందని, అతని బదులు ఏ ప్లేయర్‌ని పక్కనబెట్టినా బాగుండేదని కామెంట్ చేశాడు గౌతీ.

PREV
17
ఇషాంత్ శర్మను ఎందుకు తీసుకున్నారు... కుల్దీప్‌ను ఎందుకు పక్కనబెట్టారు... గంభీర్ కామెంట్...

ఆస్ట్రేలియా టూర్‌కి ముందు ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంలోనే గాయపడిన ఇషాంత్ శర్మ, లీగ్‌లో పెద్దగా మ్యాచులు ఆడకుండానే జట్టుకి దూరమయ్యాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్న ఇషాంత్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పాల్గొన్నాడు. అయితే సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో కూడా ఇషాంత్‌కి పెద్దగా ఆడే అవకాశం దక్కలేదు.

27

‘ఇషాంత్ కంటే సిరాజ్‌ను జట్టులోకి తీసుకుని ఉంటే బాగుండేది. ఇషాంత్ టెస్టు ఫార్మాట్ ఆడి చాలా కాలం అయిపోయింది. ఐపీఎల్ ఆడి, గాయపడి రెస్టు తీసుకున్నాడు. టీ20 క్రికెట్ నుంచి నేరుగా టెస్టుల్లో రాణించాలంటే చాలా కష్టం. అతని కంటే ఆసీస్ టూర్‌లో అద్భుతంగా రాణించిన సిరాజ్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేది...

37

టీ20ల్లో నుంచి టెస్టు ఫార్మాట్‌లోకి రాణించాలంటే రోజూ 15, 20 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఆసీస్ టూర్‌లో లాంగ్ స్పెల్స్ బౌలింగ్ చేసిన సిరాజ్‌ను పక్కనబెట్టడం మంచి మూవ్ కాదు... ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. 

47

‘కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్‌ను సిరీస్ ఆరంభంలో అద్భుతంగా వాడుకోవచ్చు. మణికట్టు స్పిన్‌ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగల బౌలర్లు దొరకడం చాలా కష్టం. కుల్దీప్ యాదవ్‌కి తొలి టెస్టులో చోటు దక్కపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 

57

బ్యాటింగ్ లైనప్‌లో ఏడో, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టుకి ఓ ప్లేయర్ కావాలి. అలాగని కుల్దీప్‌ను పక్కనబెట్టడం న్యాయం కాదు. రైట్ హ్యాండర్ లేదా లెఫ్ట్ హ్యాండర్ ఎవ్వరైనా రెండు వైపులా బంతిని తిప్పగల సామర్థ్యం ఉన్న కుల్దీప్ యాదవ్, ఏ జట్టుకైనా ఆస్తిలాంటి వాడే... 

67

అతని కోసం ఏ ప్లేయర్‌ని పక్కనబెట్టినా తప్పుకాదు...’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్. మొదటి టెస్టు ఆరంభానికి ముందు అక్షర్ పటేల్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన షాబజ్ నదీం, తొలి టెస్టులో చోటు దక్కించుకున్నాడు.

77

మొదటి రోజు ఆటలో 50 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 126 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ తీయగా... బుమ్రాకి ఓ వికెట్ దక్కింది. ఇంగ్లాండ్ ఓపెనర్ డొమినిక్ సిబ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా జో రూట్ 34+ పరుగులు చేశాడు. మూడో వికెట్‌కి 63+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు జో రూట్, సిబ్లీ...

click me!

Recommended Stories