India vs Afghanistan : టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్-8లో భారత్ బోణీ కొట్టింది. తన తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసి తొలి విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది.
Virat Kohli
బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లు రాణించడంతో 181 పరుగుల భారీ స్కోర్ సాధించింది భారత జట్టు. సూర్యకుమార్ యాదవ్ 53 పరుగులు, హార్దిక్ పాండ్యా 32 పరుగులు చేశారు.
Virat Kohli, RohitSharma
ఇక బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లను చెడుగుడు ఆడుకున్నారు. తమ సూపర్ బౌలింగ్ తో వరుస వికెట్టు తీశారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అయితే, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. ముఖ్యంగా ఈ ప్రపంచ కప్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు.
కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి టీమిండియా బ్యాటింగ్ ను ప్రారంభించాడు కోహ్లీ. అయితే, కీలకమైన ఈ మ్యాచ్ లో టచ్ ఉన్నట్టు కనిపించాడు. పరుగులు రాబట్టడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ, ఈ ప్రపంచ కప్ లో మొదటి సారి రెండంకెల స్కోర్ ను అందుకున్నాడు.
సూపర్ సిక్సర్ తో ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, 24 పరుగుల వద్ద చెత్త షాట్ ఆడి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన కింగ్ కోహ్లీ.. బాల్ తో బ్యాట్ కనెక్షన్ కుదరకపోవడంతో బౌండరీని దాటలేకపోయింది. అక్కడే ఉన్న నబీ కోహ్లీని క్యాచ్ రూపంలో పట్టుకున్నాడు.
బ్యాటింగ్ లో మరోసారి నిరాశపరిచిన కింగ్ కోహ్లీ ఏవరూ ఊహించని విధంగా ఫీల్డింగ్ లోనూ చేతిలోకి వచ్చిన ఒక క్యాచ్ ను వదిలిపెట్టాడు. ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ ఫీల్డర్లలో ఒకడిగా ఉన్న విరాట్ కోహ్లీ ఇలా క్యాచ్ ను వదిలిపెడతాడని ఏవరూ ఊహించలేదు. 3వ ఓవర్ లో అర్ష్ దీప్ బౌలింగ్ లో ఇబ్రహీం జద్రాన్ ఇచ్చిన క్యాచ్ ను కింగ్ కోహ్లీ మిస్ చేశాడు.
ఈ ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గమనిస్తే ఐర్లాండ్‌పై 1తో ప్రారంభించాడు. బ్యాక్-టు-బ్యాక్ సింగిల్-డిజిట్ స్కోర్‌లతో దానిని అనుసరించాడు. ఎట్టకేలకు ఇప్పుడు 24 పరుగులు చేశాడు. మొత్తంగా 30 పరుగులు కూడా అందుకోలేకపోయాడు. దీంతో విరాట్ ఫామ్ పై ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఈ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 29 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా నాలుగు మ్యాచ్ లను ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్ లలో 7.5 యావరేజ్, 87.88 స్ట్రైక్ రేటుతో 29 పరుగులు చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2024 లో విరాట్ కోహ్లీ ఐర్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 5 బంతులు ఆడి 1 పరుగుకే ఔట్ అయ్యాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 4 పరుగులు చేయగా, యూఎస్ఏ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. సూపర్-8 లో ఆఫ్ఘనిస్తాన్ పై 24 బంతులు ఆడి 24 పరుగులు చేశాడు.