చాలా మ్యాచ్ లలో తాను ఇలానే ప్రయత్నించాననీ, తద్వార ఇప్పుడు భారత జట్టు కోసం గేమ్ ఛేంజర్‌గా ఉండగలనని సూర్యకుమార్ పేర్కొన్నాడు. అలాగే, అమెరికాలో ఆడిన నెమ్మది హాఫ్ సెంచరీ గురించి ప్రస్తావిస్తూ.. బంతి బ్యాట్ పైకి రానప్పుడు గ్యాప్ ను గుర్తించి వికెట్ల మధ్య పరుగులు చేయాల్సి ఉంటుందనీ, జట్టు విజయం కోసం పోరాడాలని పేర్కొన్నాడు.