టీ20ల నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ! వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో వాటిపైనే ఫోకస్...

First Published | Nov 11, 2022, 4:28 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ వరకూ వచ్చిందంటే దానికి విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌ల పోరాటమే కారణం. టోర్నీ మొత్తంలో టీమిండియా ఆరు మ్యాచులు నాలుగు గెలిస్తే... వీటిల్లో సూర్య రెండు, కోహ్లీ రెండు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచారు...

విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకుని ఆడకపోయి ఉంటే టీమిండియా పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. అయితే బౌలర్లు విఫలం కావడంతో భారత జట్టు, సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో ఓడింది...


ఈ పరాజయంతో భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓ సీరియస్ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది...

Latest Videos


వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడబోతోంది భారత జట్టు. వన్డే వరల్డ్ కప్‌కి ముందు టీమిండయా 25 వన్డేలు, 12 టీ20 మ్యాచులు, 8 టెస్టులు ఆడబోతోంది. ఇకపై రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ... వన్డే ఫార్మాట్‌తో పాటు టెస్టు ఫార్మాట్‌కి పరిమితం కావాలని అనుకుంటున్నారట...

2024లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఆ సమయానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందుబాటులో ఉండడం కష్టమే. రోహిత్ ఇప్పటికే 35 ఏళ్లు దాటేయగా విరాట్ కోహ్లీకి  34 ఏళ్లు నిండాయి. ఈ వయసులో మూడు ఫార్మాట్లలో అందుబాటులో ఉండడం కష్టం...

Image credit: PTI

అందుకే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు సీనియర్లు భువీ, షమీ కూడా ఇకపై టీ20 ఫార్మాట్‌కి అందుబాటులో ఉండరని సమాచారం. వీరికి సరైన రిప్లేస్‌మెంట్ ప్లేయర్లను తయారుచేసేందుకు బీసీసీఐ దగ్గర రెండేళ్ల సమయం ఉంటుంది. 30 మ్యాచులు కూడా ఆడిన అనుభవం లేని అర్ష్‌దీప్ సింగ్, టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టే కొత్త కుర్రాళ్లు... టీమిండియాకి విజయం తెచ్చిపెడతారని ఆశిస్తోందట బీసీసీఐ... 

వెస్టిండీస్, శ్రీలంక వంటి జట్లు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సరైన విజయాలు అందుకోలేకపోతున్నాయి. టీమిండియా పరిస్థితి అలా కాకుండా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల రిటైర్మెంట్‌కి ముందు మ్యాచ్ విన్నర్లను తయారుచేసే పనిలో పడింది భారత క్రికెట్ బోర్డు.. 

click me!