ద్రావిడ్ కాదు కావాల్సింది! టీ20లకు వీరేంద్ర సెహ్వాగ్‌ని కోచ్‌గా నియమించాలంటూ డిమాండ్...

First Published | Nov 11, 2022, 2:55 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ నుంచి నిష్కమించింది. ఐపీఎల్ రూపంలో వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్‌ని నిర్వహిస్తున్న బీసీసీఐ, 15 ఏళ్లుగా టీ20 వరల్డ్ కప్ గెలవలేకపోతోంది. దీంతో టీమిండియాలో సమూల మార్పులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Rohit-Dravid

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీతో రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగియడంతో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్. ద్రావిడ్ హెడ్ కోచింగ్‌లో గత సంవత్సర కాలంలో దాదాపు 10 మంది కెప్టెన్లను మార్చింది టీమిండియా...

Image credit: PTI

రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో టీమ్‌ని నడిపించబోతున్నట్టు ప్రకటించాడు. టీమిండియా ఆడే విధానమే మారిపోతుందని ఓ లెవెల్‌లో ప్రకటించాడు. తీరా చూస్తే ఆసియా కప్ 2022 టోర్నీతోనూ రోహిత్ అగ్రెసివ్ యాటిట్యూడ్ ప్లే.. అటకెక్కింది...


Suryakumar Yadav

టీమ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా వంటి ఒకరిద్దరు ప్లేయర్లు మినహాయిస్తే మిగిలిన ప్లేయర్లు, టీ20ల్లో కూడా వన్డే, టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ కోవలోకే వస్తాడు. టీ20ల్లో నాలుగు సెంచరీలు బాదిన రోహిత్, టీ20 వరల్డ్ కప్‌లో 6 మ్యాచుల్లో కలిపి ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు..

హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, జిడ్డు బ్యాటింగ్‌కి పెట్టింది పేరు. ప్రపంచంలోనే టెస్టుల్లో అత్యధిక బంతులను ఎదుర్కొన్న రికార్డు ద్రావిడ్ సొంతం. అలాగే రాహుల్ ద్రావిడ్‌ని హెడ్ కోచ్‌గా నియమించుకున్న జట్టు, ఇంతకంటే గొప్పగా ఎలా బ్యాటింగ్ చేస్తుందనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి...

Kohli and Sehwag

టీ20ల్లో మొదటి బంతి నుంచే బౌండరీలు బాదుతూ, ప్రత్యర్థి బౌలర్లపై దండయాత్ర చేసే ప్లేయర్లు కావాలి. సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు చేసింది అదే, భారత ఓపెనర్లు చేయలేకపోయింది ఇదే. దీంతో జిడ్డు బ్యాటింగ్ చేసే ‘వాల్’ రాహుల్ ద్రావిడ్‌ని టెస్టులకు పరిమితం చేసి... టీ20లకు వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్‌ని హెడ్ కోచ్‌గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు టీమిండియా అభిమానులు...

Virender Sehwag

టెస్టులను వన్డేల్లా, వన్డేలను టీ20ల్లా ఆడడం వీరేంద్ర సెహ్వాగ్ స్పెషాలిటీ. అలాంటి వీరూ, హెడ్ కోచ్‌గా వస్తే.. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వగైరా ప్లేయర్ల బ్యాటింగ్ స్టైల్ మారిపోతుందని అంటున్నారు అభిమానులు.

వీళ్లు మారకపోతే టీ20లకు ఎలాంటి ప్లేయర్లు కావాలో వీరూకి బాగా తెలుసని, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి వంటి కుర్రాళ్లను వీరూ జట్టులోకి తీసుకొస్తాడని అంటున్నారు నెటిజన్లు... సౌమ్యుడైన రాహుల్ ద్రావిడ్ కంటే, ఆట విషయంలో కఠినంగా వ్యవహరించే సెహ్వాగ్ స్టైల్.. టీమిండియాకి ఇప్పుడు చాలా అవసరమంటూ కామెంట్లు చేస్తున్నారు... 

Latest Videos

click me!