ఎమ్మెస్ ధోనీని వెనక్కి నెట్టేసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... ఆ లిస్టులో టాప్‌లో యువరాజ్ సింగ్...

Published : Jun 07, 2023, 05:27 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 టోర్నీకి రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తుంటే, గత డబ్ల్యూటీసీ ఫైనల్‌కి కెప్టెన్సీ చేసిన విరాట్ కోహ్లీ, టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్నారు... ఈ ఇద్దరూ, డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌తో అరుదైన లిస్టులో చేరారు...  

PREV
17
ఎమ్మెస్ ధోనీని వెనక్కి నెట్టేసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... ఆ లిస్టులో టాప్‌లో యువరాజ్ సింగ్...
Kohli-Rohit

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరికీ ఇది ఆరో ఐసీసీ టోర్నీ ఫైనల్ మ్యాచ్. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన రోహిత్ శర్మ, ఆ తర్వాత జరిగిన 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో చోటు దక్కించుకోలేకపోయాడు...

27
Virat Kohli-Rohit Sharma

2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులు ఆడాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి కెప్టెన్సీ చేసిన విరాట్ కోహ్లీ, 2021 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి సారథిగా వ్యవహరించాడు...

37
Cummins-Rohit

2007 టీ20 వరల్డ్ కప్ తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఆడని రోహిత్ శర్మ... విరాట్ కోహ్లీతో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ఆడాడు. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌కి కెప్టెన్సీ చేస్తున్నాడు..

47
Image credit: PTI

టీమిండియా తరుపున అత్యధిక ఐసీసీ ఫైనల్స్ ఆడిన ప్లేయర్లుగా రెండో స్థానంలో నిలిచారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 7 సార్లు, ఐసీసీ ఫైనల్స్ ఆడి టాప్‌లో నిలిచాడు...

57
Image Credit: Getty Images

2000వ సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ ఫైనల్స్‌ ఆడిన యువరాజ్ సింగ్, 2002 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ ఆడాడు.. 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఆడాడు. ఆ తర్వాత 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడాడు యువీ...

67
Image Credit: Getty Images

2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన యువరాజ్ సింగ్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడి... టీమిండియా తరుపున అత్యధిక సార్లు ఐసీసీ ఫైనల్స్ ఆడిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు..

77

మహేంద్ర సింగ్ ధోనీ నాలుగు సార్లు ఐసీసీ ఫైనల్స్ ఆడగా, రవీంద్ర జడేజాకి ఇది ఐదో ఐసీసీ ఫైనల్.. సచిన్ టెండూల్కర్, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ నాలుగేసి సార్లు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్స్ ఆడారు...

Read more Photos on
click me!

Recommended Stories