డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెండు పిచ్‌లు... లండన్‌లో పెరుగుతున్న ఆందోళనలు, అదే జరిగితే...

First Published Jun 7, 2023, 4:34 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023 ఫైనల్‌కి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదిక ఇస్తోంది. క్రికెట్‌కి పుట్టినిల్లుగా చెప్పుకునే లండన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడం వరుసగా ఇది రెండోసారి. ఈ ఫైనల్ మ్యాచ్‌ కోసం రెండు రకాల పిచ్‌లను తయారుచేసింది ఐసీసీ. దీనికి కారణం లండన్‌లో పెరుగుతున్న ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ ఉద్యమం...

కొన్ని నెలలుగా లండన్‌లో ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ (Just Stop Oil) ఉద్యమం జోరుగా సాగుతోంది. లండన్‌లో ఇంధన సంస్థలకు విరివిగా లైసెన్సులు ఇస్తున్న అక్కడి ప్రభుత్వం, 2025 నాటికి కొత్తగా 100కి పైగా కొత్త ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులను తీసుకురావాలని చూస్తోంది..
 

Just Stop Oil

అడ్డగోలుగా ఆయిల్ కంపెనీలకు లైసెన్సులు ఇవ్వడం వల్ల వాతావరణంలో మార్పులు జరిగి, భూతాపం పెరుగుతోందని... వాతావరణంపై ఇది తీవ్ర ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ ఉద్యమకర్తలు...

Image Credit: Getty Images

మార్చి 2022లో ఈ ఉద్యమం మొదటిసారిగా వార్తల్లో నిలిచింది. ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగు మ్యాచులు జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన ఉద్యమకారులు, ఆటకు పలుమార్లు అంతరాయం కలిగించారు..

Image Credit: Getty Images

అందులో ఒకడు గోల్ పోస్టును పట్టుకుని కూర్చుంటే, మరొకరు గొంతుకు తాడు బిగించుకుని చనిపోతానని బెదిరించాడు. ఇలా చాలాసేపు ఆట ఆగిపోవడానికి కారణమయ్యారు... ఈ సంఘటన తర్వాత ఈ ఉద్యమానికి సామాన్య జనం నుంచి మంచి మద్ధతు వచ్చింది. కొన్నిరోజుల్లోనే ఉద్యమకారుల సంఖ్య భారీగా పెరిగింది..

Image Credit: Getty Images

లండన్‌లో అత్యంత రద్దీగా ఉండే రహదారులపై భైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ ఉద్యమకారులు, నగరంలో నిర్వహించిన చాలా క్రీడా టోర్నీలకు అంతరాయం కలిగించారు. 

Image Credit: Getty Images

వరల్డ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌తో పాటు బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ వంటి మెగా టోర్నీలకు కూడా ఈ ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ ఉద్యమం సెగ తగిలింది. దీంతో లండన్‌లో నిర్వహిస్తున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌పై కూడా ఈ ఉద్యమ ప్రభావం పడవచ్చని ఐసీసీకి సంకేతాలు అందాయి...

అందుకే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ముందు జాగ్రత్తగా రెండు పిచ్‌లను సిద్ధం చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఒకవేళ ఏ కారణంగానైనా ఓ పిచ్ ఆటకు అణువుగా లేకపోతే, మ్యాచ్‌కి అంతరాయం కలగకుండా రెండో పిచ్‌ మీద ఆటను కొనసాగిస్తారు..

click me!