ఆ క్రికెటర్ ఐస్‌క్రీమ్‌లో పప్పు వేసుకుని తింటాడు... విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్...

Published : Oct 06, 2022, 05:49 PM IST

పుర్రెకో బుద్ధి, జిహ్వాకో రుచి! ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టేస్ట్ ఉంటుంది. అయితే ఐస్‌క్రీమ్‌లో గులాబ్ జామున్‌ వేసుకుని తినేవాళ్లు చాలామందే ఉంటారు కానీ పప్పు వేసుకుని తినేవాళ్లు కూడా ఉంటారా? చాలామందికి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలో బ్రహ్మానందం గుర్తుకు రావచ్చు. భారత జట్టులోనే అలాంటి ఫుడ్ హ్యాబిట్ ఉన్న ప్లేయర్‌ని చూశానని అంటున్నాడు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...

PREV
16
ఆ క్రికెటర్ ఐస్‌క్రీమ్‌లో పప్పు వేసుకుని తింటాడు... విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్...

ఎంఎస్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ, అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న భారత సారథిగా టాప్‌లో నిలిచాడు. కోహ్లీ కెప్టెన్సీలో టెస్టుల్లో వృద్ధిమాన్ సాహా ఎక్కువ మ్యాచుల్లో వికెట్ కీపర్‌గా ఆడాడు...

26

‘తినేటప్పుడు కొత్త కొత్త రకాలు, వింత వింత కాంబినేషన్లు ట్రై చేయాలంటే వృద్ధిమాన్ సాహా వల్లే అవుతుంది. అతని ప్లేట్‌లో బటర్ చికెన్, రోటీ, సలాడ్‌తో పాటు రసగుల్లా కూడా ఉంటుంది. అంతేకాదు అతను తినే విధానం కూడా వింతగా ఉంటుంది...

36

రెండు ముక్కలు రోటీ, సలాడ్ కొరికి మధ్యలో రసగుల్లాని నోట్లో వేసుకుంటాడు. అతను తినే విధానం చూస్తే షాకింగ్‌గా అనిపిస్తుంది. ఓసారి ‘వృద్ధీ ఏం చేస్తున్నావ్’ అని అడిగాడు. దానికి అతను నేను ఇలాగే తింటానని చెప్పాడు...

46
Kohli Eating Biriyani

అంతేనా ఓసారి ఐస్‌క్రీమ్‌లో దాల్ ఛావల్ వేసుకుని తినడం చూసి దిమ్మతిరిగిపోయింది... అంతేనా కొన్నిసార్లు అన్నం నోట్లో పెట్టుకుని, ఐస్‌క్రీమ్ తింటాడు. అతన్ని చూసినప్పుడు ఈ క్రియేటివిటీని ఆటలో చూపిస్తే బాగుంటుంది కదా... అనుకుంటూ ఉంటా...

56
Virat Kohli

నాకు పారిస్‌కి వెళ్లినప్పుడు వరస్ట్ ఫుడ్ అనుభవం కలిగింది. వెజిటేరియన్లకు పారిస్ నరకంలాంటిది. అక్కడ చాలా ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. అయితే వెజిటేరియన్లకు కావాల్సింది ఒక్కటీ దొరకదు. మనం చెప్పేది కూడా వాళ్లకి అర్థం కాదు...

66

భూటాన్‌లో బెస్ట్ ఫుడ్ తిన్నాను. అక్కడ సహజసిద్దంగా పెరిగిన కాయకూరలు, పండ్లు, అడవి బియ్యం దొరుకుతాయి. దీన్ని వాళ్లు భూటానిస్ ఫామ్‌హౌజ్ అంటారు. కొండలపైకి నడుచుకుంటూ వెళ్లి అక్కడ పెరిగిన పండ్లు కోసుకుని తినడం, చాలా మంచి అనుభవం...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ సారథి, క్రికెటర్ విరాట్ కోహ్లీ.. 

Read more Photos on
click me!

Recommended Stories