ఒలింపిక్స్ నుంచి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు.. 2024లో టాప్-10 స్పోర్ట్స్ ఈవెంట్‌లు ఇవే..

Published : Jan 02, 2024, 05:34 PM IST

Sports Calendar 2024: 2024లో అనేక క్రీడా ఈవెంట్లు జ‌ర‌గ‌నున్నాయి. పారిస్ ఒలింపిక్స్ తో పాటు ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్, పారాలింపిక్స్, ఐపీఎల్ 2024 వంటి మేగా స్పోర్ట్స్ ఈవెంట్లు జ‌ర‌గ‌నున్నాయి. 2024లో జ‌రగ‌బోయే ప్ర‌ధాన క్రీడా పోటీలు గమనిస్తే..    

PREV
110
ఒలింపిక్స్ నుంచి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు.. 2024లో టాప్-10 స్పోర్ట్స్ ఈవెంట్‌లు ఇవే..
Image credit: PTI

1. ఏఎఫ్సీ ఆసియా కప్

ఏఎఫ్సీ ఆసియా కప్ జనవరి 12న ప్రారంభమై ఫిబ్ర‌వ‌రి 10వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ ఏడాది ఖతార్‌లో AFC ఆసియా కప్ (ఫుట్‌బాల్) జరుగుతుంది. సౌదీ అరేబియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బ‌రిలోకి దిగ‌నుండ‌గా, భారత జట్టుకు సునీల్ ఛెత్రి నాయకత్వం వహించనున్నాడు.
 

210
T20 World Cup 2024

2. ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ 4 నుండి జూన్ 30 వరకు జ‌ర‌గ‌నుంది. ఈ పొట్టి క్రికెట్ మెగా ఈవెంట్ కు వెస్టిండీస్, యూఎస్ఏ లు వేదిక‌లు కానున్నాయి. ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బ‌రిలోకి దిగుతోంది.
 

310
India Women Cricket

3. మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్

ఐసీసీ పురుషుల టీ20 ప్ర‌పంచ క‌ప్ తో పాటు మ‌హిళ‌ల క్రికెట్ 20 ప్ర‌పంచ క‌ప్ కూడా ఈ ఏడాది జ‌ర‌గ‌నుంది. సెప్టెంబర్-అక్టోబర్ 2024లో బంగ్లాదేశ్ వేదిక‌గా జరుగుతుంది. అయితే, మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్ అధికారిక షెడ్యూల్ ను ఇంకా ప్రకటించలేదు.
 

410

4. పారిస్ ఒలంపిక్స్ 2024

2024లో పారిస్‌లో ఒలింపిక్స్ గేమ్స్ జ‌ర‌గ‌నున్నాయి. జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు ఈ మెగా ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. అయితే, ఒలింపిక్స్ 2024లోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ గా చెప్ప‌వ‌చ్చు.
 

510

5. పారా ఒలింపిక్స్ 

2024లో పారాలింపిక్స్‌కు కూడా పారిస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఈవెంట్ ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు జరుగుతుంది.

610
India Under 19 Team

6. అండ‌ర్-19 ప్ర‌పంచ క‌ప్ 

2024 జనవరి 19 నుండి ఫిబ్రవరి 11 మధ్య దక్షిణాఫ్రికాలో U-19 ప్రపంచ కప్‌కు టోర్నీ జ‌ర‌గ‌నుంది. గ‌త ఎడిష‌న్ లో భారత్ విజేత‌గా నిలువ‌గా, ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది.
 

710
Indian women's hockey team celebrates silver at Youth Olympics 2018

7. వింటర్ యూత్ ఒలింపిక్స్‌

ఈ ఏడాది వింటర్ యూత్ ఒలింపిక్స్ కూడా జ‌ర‌గ‌నున్నాయి. దక్షిణ కొరియాలోని గ్యాంగ్వాన్ దీనికి వేదిక‌గా కాగా, జనవరి 19 నుంచి ఫిబ్రవరి 1 మధ్య వింటర్ యూత్ ఒలింపిక్స్ నిర్వ‌హించ‌నున్నారు. 

810

8. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

మార్క్యూ టెస్ట్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది డిసెంబర్ 1వ వారంలో 4 టెస్టులతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
 

910
Badminton

9. ఇండియా ఒపెన్ 2024 (బ్యాడ్మింటన్)

భార‌త్ లో జ‌ర‌గ‌బోయే మెగా టోర్నీల‌లో ఒక‌టి. 2024 ఇండియా ఓపెన్, బ్యాడ్మింటన్ (సూపర్ 750) ఈవెంట్ కు దేశ రాజ‌ధాని న్యూ ఢిల్లీ వేదిక కానుంది. జనవరి 16 నుంచి 21 వ‌ర‌కు ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఇండియా ఓపెన్, సూపర్ 750 ఈవెంట్‌గా రెండవసారి నిర్వస్తుండ‌గా, చాలా మంది బ్యాడ్మింటన్ స్టార్లు పాల్గొంటారని భావిస్తున్నారు.

1010
IPL 2024

10. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీడ్ (ఐపీఎల్ 2024)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) ఎడిష‌న్ మార్చి 22 నుండి మే 29* వ‌ర‌కు జ‌రిగే అవ‌కాశ‌ముంది. అయితే, భారతదేశ‌ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తేదీలు మారే అవ‌కాశం అధికంగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories