గంగూలీ విషయంలో జరిగిందే, విరాట్ కోహ్లీ విషయంలో... వన్డే కెప్టెన్సీని వదులుకోవడానికి...

First Published Dec 9, 2021, 9:41 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టులో సంచలన మార్పులు జరుగుతున్నాయి. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా తప్పుకోగా, తాజాగా అతన్ని వన్డే కెప్టెన్‌గా కూడా తప్పిస్తూ, సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ గత నాలుగేళ్లలో ఐసీసీ టైటిల్ గెలవలేకపోయాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో భారత జట్టు విఫలమైంది...

ఈ ప్రదర్శనే విరాట్ కోహ్లీపై వేటు వేయడానికి కారణమని తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీని, వన్డే కెప్టెన్సీ నుంచి కూడా స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరింది బీసీసీఐ...

అయితే వన్డేల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. వన్డేల్లోనూ కాదు, టీ20ల్లోనూ విరాట్ రికార్డు అద్భుతం. వన్డేల్లో, టీ20ల్లో భారత జట్టుకి అత్యధిక శాతం విజయాలను అందించిన సారథి విరాట్ కోహ్లీయే...

టెస్టు ఫార్మాట్‌లో అయితే ఆల్‌టైం గ్రేట్ టెస్టు కెప్టెన్లలో ఒకడిగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. వన్డేల్లో కెప్టెన్‌గానే కాకుండా, బ్యాట్స్‌మెన్‌గానూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు విరాట్...

ఐసీసీ టైటిల్ గెలవడానికి విరాట్ కోహ్లీకి తగినన్ని అవకాశాలు దొరకలేదు. ఎమ్మెస్ ధోనీ లక్కీగా 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్ కప్ టైటిల్స్ సాధిస్తే... ఆ తర్వాత 2015 వన్డే వరల్డ్‌కప్‌తో పాటు 5 సీజన్లలో టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో టీమిండియా విఫలమైంది...

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఆడింది ఒక్క వన్డే వరల్డ్‌ కప్, ఒకే ఒక్క టీ20 వరల్డ్ కప్. ఆ మాత్రం దానికి ఐసీసీ టైటిల్ గెలవలేదని విరాట్ కోహ్లీ, కెప్టెన్‌గా పనికి రాడని పరిగణించడం కరెక్ట్ కాదు...

కెప్టెన్‌గా 2023 వన్డే వరల్డ్‌కప్‌‌ను గెలవాలని భావిస్తున్న విరాట్ కోహ్లీ, బీసీసీఐ డిమాండ్‌కి సమ్మతించకపోవడంతో సౌతాఫ్రికా టూర్‌కి రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి...

వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించేందుకు గంగూలీ రూట్‌నే ఫాలో అయ్యింది బీసీసీఐ. 2003 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న గ్రెగ్ ఛాపెల్, టీమిండియాని పటిష్టంగా తయారుచేయడానికి అవసరమైన దిద్దుబాటు చర్యలు మొదలెట్టాడు.

కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయినా, బ్యాట్స్‌మెన్‌గా ఫెయిల్ అవుతున్న సౌరవ్ గంగూలీని ఆ బాధ్యతల నుంచి బలవంతంగా తప్పించాడు. ఇప్పుడు బీసీసీఐ బాస్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ, విరాట్ విషయంలో ఇదే ఫార్ములాని వాడాడు...

అయితే అప్పుడు సౌరవ్ గంగూలీకి, ఇప్పుడు విరాట్ కోహ్లీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గంగూలీ పరుగులు చేయలేక జట్టుకి భారంగా మారితే, విరాట్ కోహ్లీ ఇప్పటికే పేలవ ఫామ్‌లోనూ మిగిలిన ప్లేయర్లతో పోటీపడేలా పరుగులు చేస్తున్నాడు...

వన్డే కెప్టెన్‌గా 70 శాతం విజయాలు, 72.65 బ్యాటింగ్ సగటుతో అత్యుత్తమ యావరేజ్ కలిగిన సారథిగా టాప్‌లో నిలిచిన విరాట్ కోహ్లీని ఇలా అవమానించడం కరెక్ట్ కాదని అంటున్నారు ఆయన అభిమానులు...

click me!