టీమిండియాని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్య నాలుగో స్థానం. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ ఆ ప్లేస్‌లో ఫిక్స్ అయిపోయినా, వన్డేల్లో మాత్రం అతని నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రావడం లేదు.
కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో ఆ ప్లేస్‌లో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా ఇలా చాలామందిని నాలుగో స్థానంలో ప్రయత్నించింది టీమిండియా.. ఓపెనర్‌గా వన్డేల్లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్‌లో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు..
28
Sanju Samson
సంజూ శాంసన్‌కి వన్డేల్లో మంచి రికార్డు ఉన్నప్పటికీ, ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ని ఆ ప్లేస్‌లో ఫిక్స్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. సూర్య మాత్రం టీ20ల్లో ఆడినట్టు వన్డేల్లో ఆడలేకపోతున్నాడు..
38
యువరాజ్ సింగ్ తర్వాత అంబటి రాయుడిని నాలుగో స్థానంలో ఆడిస్తూ వచ్చింది టీమిండియా. అయితే 2019 వన్డే వరల్డ్ కప్‌లో అతన్ని కాదని, విజయ్ శంకర్‌ని సెలక్ట్ చేసిన సెలక్టర్లు, టీమిండియా ఓటమికి కారణమయ్యారు..
48
virat kohli
‘ఎవ్వరూ దొరకకపోతే విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడించండి. అతను ఏ ప్లేస్‌లో అయినా ఆడగల ఫ్లెక్సిబుల్ ప్లేయర్. 2019 వన్డే వరల్డ్ కప్‌లో కూడా నేనే కోచ్‌గా ఉన్నా. ఆ సమయంలో కూడా నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీని ఆడించడంపై చర్చించుకున్నాం..
58
virat kohli
టాపార్డర్‌లో వెంటవెంటనే 2 వికెట్లు పడితే, మిడిల్ ఆర్డర్‌లో బాధ్యత తీసుకుని భాగస్వామ్యం నిర్మించే ప్లేయర్లు కావాలి. దానికి అనుభవం ఉండడం తప్పనిసరి. విరాట్ కోహ్లీకి నాలుగో స్థానంలో కూడా మంచి రికార్డు ఉంది. అతను ఆ ప్లేస్‌కి సరిగ్గా సెట్ అవుతాడు..
68
శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని టీమ్‌లోకి వస్తున్నారు. వారిపై వెంటనే భారం వేయడం కంటే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్‌ని పూర్తిగా వాడుకోవడంపై టీమిండియా శద్ధ పెడితే బాగుంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..
78
virat kohli batting
వన్డేల్లో నాలుగో స్థానంలో 42 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, 55.21 సగటుతో 1767 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తర్వాత వన్ డౌన్ ప్లేయర్‌గా సెటిలైన విరాట్ కోహ్లీ.. ఆ ప్లేస్‌లో పాతుకుపోయాడు..
88
Virat Kohli
శ్రేయాస్ అయ్యర్, నాలుగో స్థానంలో 20 వన్డేలు ఆడి 47.35 సగటుతో 805 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే 2021 మార్చి నుంచి శ్రేయాస్ అయ్యర్ వరుసగా గాయాలతో సతమతమవుతూ క్రికెట్‌కి దూరమవుతూ వస్తున్నాడు..