ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ని కాపాడేందుకు కోట్ల ఢీల్ వదులుకున్న అక్షయ్ కుమార్... ఆ రోజు అలా చేయకుంటే..

Published : Aug 17, 2023, 11:10 AM ISTUpdated : Aug 17, 2023, 11:24 AM IST

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఓటములు ఎదుర్కొన్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. 16 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న జట్లలో ఆఖరిగా ఫైనల్ చేరింది కూడా ఢిల్లీ క్యాపిటల్సే. 2008లో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ, 2020 సీజన్‌లో మొట్టమొదటిసారి ఫైనల్ చేరింది..

PREV
19
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ని కాపాడేందుకు కోట్ల ఢీల్ వదులుకున్న అక్షయ్ కుమార్... ఆ రోజు అలా చేయకుంటే..

ఐపీఎల్ ఆరంభంలో బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది ఢిల్లీ డేర్‌డెవిల్స్. మొదటి సీజన్‌లో వీరేంద్ర సెహ్వాగ్, ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు..

29

2009 సీజన్‌లో గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2010లో 5వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ ఛాన్స్ చేజార్చుకుంది. 2010లో 10వ స్థఆనంలో నిలిచి అట్టర్ ఫ్లాప్ అయిన ఢిల్లీ, 2012 తర్వాత 6 సీజన్ల పాటు ప్లేఆఫ్స్ చేరలేకపోయింది..

39

ఆరంభంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్, ఐపీఎల్ నుంచి తప్పుకోకుండా అక్షయ్ కుమార్ కాపాడాడంటూ బయటపెట్టాడు టీమిండియా మాజీ అడ్మినిస్ట్రేటర్ అమృత్ మథుర్.. 

49

‘ఐపీఎల్ ఆరంభంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో అక్షయ్ కుమార్ మూడేళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ప్రమోషనల్ యాడ్స్‌తో పాటు మీటింగ్స్‌కి, కార్పొరేట్ ఈవెంట్స్‌కి అక్షయ్ హాజరుకావాల్సి ఉంటుంది. కోట్లాలో అక్షయ్ కుమార్ చేసిన డేరింగ్ స్టంట్స్‌‌కి మంచి క్రేజ్ వచ్చింది..

59

అయితే ఆ తర్వాత అక్షయ్ కుమార్ లాంటి స్టార్‌ని ఎలా వాడుకోవాలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్‌ మేనేజ్‌మెంట్‌కి అర్థం కాలేదు. 2008 సీజన్ చివరికి వచ్చేసరికి ఫ్రాంఛైజీకి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. భారీగా ఖర్చు పెరిగిపోయి ఫైనాన్షియల్‌గా నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న పరిస్థితి..

69

దీంతో అక్షయ్ కుమార్‌తో కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం ఏ కారణం చేతనైనా కాంట్రాక్ట్‌ను మధ్యలోనే రద్దు చేసుకుంటే మూడేళ్లకు అగ్రిమెంట్ చేసుకున్న మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 

79

ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్, కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకోగానే, అక్షయ్ కుమార్ లాయర్.. కాంట్రాక్ట్ ప్రకారం మొత్తం సొమ్ము చెల్లించాల్సిందిగా లీగల్ నోటీసులు పంపారు. అది ముందుకు వెళ్లి ఉంటే, ఢిల్లీ డేర్‌డెవిల్స్ పని అక్కడితో ముగిసిపోయి ఉండేది..

89

నేను, ఆయన్ని ఓ షూటింగ్ సమయంలో కలిశాను. షాట్ ముగిసిన తర్వాత వానిటీ వ్యాన్‌లో అక్షయ్ కుమార్‌ని కలిసి పరిస్థితిని వివరించాను. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పాను. ఆయన ఎంతో సహృదయంతో పర్లేదు జీ అన్నారు..

99

వర్కవుట్ కాకపోతే వదిలేయండి. అందులో ఏముంది. ఆ కాంట్రాక్ట్‌ని క్లోజ్ చేసేద్దాం. మీరు నాకేం నష్టపరిహారం ఇవ్వాల్సిన పనిలేదు, నేను మా లాయర్‌తో మాట్లాడతానని చెప్పారు. ఆయన పెద్ద మనసు చేసుకుని అలా చేయకపోయి ఉంటే ఢిల్లీ ఫ్రాంఛైజీ కథ ఎప్పుడో ముగిసిపోయి ఉండేది..’ అంటూ చెప్పుకొచ్చాడు  టీమిండియా మాజీ అడ్మినిస్ట్రేటర్ అమృత్ మథుర్.. 

click me!

Recommended Stories