ఇలా ఆడితే ఇండియాలో కూడా గెలవలేరు! దూకుడు కావాలి, కసిగా ఆడాలి... కపిల్ దేవ్ కామెంట్స్..

Published : Aug 17, 2023, 11:43 AM IST

కీలక ఆటగాళ్ల గాయాలు, నిలకడలేమి ప్రదర్శన, బిజీ షెడ్యూల్, రెస్ట్ కోరుకునే సీనియర్లు, పస లేని మ్యాచులు.. ఇప్పుడు టీమిండియాని వెంటాడుతున్న సమస్యలు ఎన్నో మరెన్నో.. వీటికి తోడు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ చేతుల్లో టీ20 సిరీస్ ఓడిపోయింది భారత జట్టు..  

PREV
16
ఇలా ఆడితే ఇండియాలో కూడా గెలవలేరు! దూకుడు కావాలి, కసిగా ఆడాలి... కపిల్ దేవ్ కామెంట్స్..
Image credit: PTI

ఆస్ట్రేలియా చేతుల్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఓడిన టీమిండియా, వెస్టిండీస్ టూర్‌లో రికార్డులు కొల్లగొట్టి, దుమ్ముదులిపి రావడం ఖాయమనుకుంటే... సీన్ తేడా కొట్టేసింది. ఫామ్‌లో లేని టీమ్‌తో కూడా మనవాళ్లు ఏ సిరీస్‌లోనూ క్లీన్ స్వీప్స్ చేయలేకపోయారు..
 

26
Image credit: PTI

ప్రస్తుతం ఐర్లాండ్ టూర్‌లో ఉన్న భారత జట్టు, ఈ మూడు టీ20 మ్యాచుల సిరీస్ ముగిసిన తర్వాత ఆసియా కప్, ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, అటు నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల్లో పాల్గొంటుంది.. 

36
Image credit: PTI

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతోనే టీ20 సిరీస్ ఆడి సౌతాఫ్రికా పర్యటనకు వెళ్తుంది. ఈ టూర్ ముగిసిన తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్‌లతో సిరీస్‌లు ఉంటాయి. జనవరి 25 నుంచి ఇంగ్లాండ్, టీమిండియా మధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ మొదలు కానుంది..
 

46
Ben Stokes

‘బజ్‌బాల్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ సిరీస్, నేను ఈ మధ్యకాలంలో చూసిన బెస్ట్ టెస్టు సిరీసుల్లో ఒకటి. అసలు టెస్టు క్రికెట్ ఆడాల్సింది ఇలాగే..

56

రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగుంది అయితే ఇంగ్లాండ్ వంటి టీమ్స్‌పైన గెలవాలంటే ఇది సరిపోదు. దూకుడు కావాలి, గెలవాలనే కసి పెరగాలి. మ్యాచ్ గెలవడమే ప్రధానం. అంతేకానీ ఎలాగోలా డ్రా చేసుకుందామనే ధోరణి కనిపించకూడదు..

66

వెస్టిండీస్ పర్యటనలో ఆడినట్టు ఆడితే, ఇండియాలో కూడా గెలవలేరు. ఎందుకంటే బజ్‌బాల్‌‌ను ఎదుర్కొని నిలవాలంటే మన స్పిన్ బాల్ త్రయం దుమ్ముదులపాలి. మన బ్యాటర్లు అదరగొట్టాలి. నేను ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.. 

Read more Photos on
click me!

Recommended Stories