మరో మైలురాయి అందుకున్న విరాట్ కోహ్లీ... ఆసియాలోనే ఎవ్వరికీ సాధ్యంకాని ఫీట్‌తో...

First Published Sep 3, 2021, 4:45 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్యకాలంలో పెద్దగా ఫామ్‌లో లేడు. సెంచరీ మార్కు అందుకుని దాదాపు రెండేళ్లు దాటిపోయింది. అయితే సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు... ఇప్పటికే దేశంలో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీగా నిలిచిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు...

ఇన్‌స్టాగ్రామ్‌లో 150 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటేసిన విరాట్ కోహ్లీ... ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా, ఆసియా వాసిగా, క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

2015, జూన్ 23న ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, అదే ఏడాది డిసెంబర్‌ 27న 1 మిలియన్ ఫాలోవర్లను అందుకున్నాడు. ఆ తర్వాత అతని ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ జెట్ స్పీడ్‌తో పెరుగుతూ పోయింది...

2020, ఫిబ్రవరి 18న 50 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్న విరాట్ కోహ్లీ... ఈ మార్కును అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు... మాస్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న ధోనీ, ఇప్పటికీ ఈ రికార్డుకి చాలా దూరంలో ఉండిపోయాడు..

2021, మార్చి 3న 100 మిలియన్ల ఫాలోవర్లను అందుకుని, సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ... ఆ తర్వాత ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీగా రికార్డు క్రియేట్ చేశాడు...

100 మిలియన్ల మార్కు దాటిన తర్వాత మరింత వేగంగా విరాట్ కోహ్లీ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతూ పోయింది. 2021, సెప్టెంబర్ 3న 150 మిలియన్ల మార్కును అందుకున్నాడు విరాట్...

మొదటి 100 మిలియన్ల ఫాలోవర్లు వచ్చేందుకు 562 రోజుల సమయం పడితే, ఆ తర్వాత 50 మిలియన్ల ఫాలోవర్లు వచ్చేందుకు కేవలం 187 రోజులు మాత్రమే పట్టింది...

ఈ స్పీడ్‌లో దూసుకుపోతే ఫుట్‌బాల్ దిగ్గజాలను తలదన్ని టాప్‌లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. రొనాల్డో 337 మిలియన్ల ఫాలోవర్లతో టాప్‌లో ఉంటే, బాలీవుడ్ సూపర్ స్టార్ డేవిడ్ జాన్సన్ 266 మిలయన్లతో రెండో స్థానంలో ఉన్నాడు...

లియోనెల్ మెస్సీ 260 మిలియన్లతో టాప్ 3లో ఉంటే, నేమర్ జూనియర్ 160 మిలియన్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. టాప్ 5లో ఉన్న విరాట్ కోహ్లీ... ఈ లిస్టులో టాప్ 10లో ఉన్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు...

click me!