అన్ని టీమ్స్‌లో కలిపి 2011 వన్డే వరల్డ్ కప్ ఆడి 2023 వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్న వారి సంఖ్య ఎనిమిది మంది. ఇండియా నుంచి ఇద్దరు, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ నుంచి ఒక్కొక్కరు మాత్రమే 2011 వన్డే ప్రపంచ కప్ ఆడి, 2023 వరల్డ్ కప్ ఆడబోతున్నారు..
విరాట్ కోహ్లీ:2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో 9 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, 282 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 49 బంతులు ఆడి 35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సెహ్వాగ్, సచిన్ అవుటైన తర్వాత గంభీర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు.
రవిచంద్రన్ అశ్విన్: 2010లో అంతర్జాతీయ వన్డే ఆరంగ్రేటం చేసిన అశ్విన్, 2011 వన్డే వరల్డ్ కప్‌లో 2 మ్యాచులు ఆడాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 41 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన అశ్విన్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ 2 వికెట్లు తీశాడు. షేన్ వాట్సన్, రికీ పాంటింగ్ వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Steve Smith-Cameron Green
స్టీవ్ స్మిత్: ప్రస్తుతం ఆస్ట్రేలియాకి ప్రధాన బ్యాటర్‌గా ఉన్న స్టీవ్ స్మిత్, 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకి ప్రధాన స్పిన్నర్‌గా ఆడాడు. లెగ్ స్పిన్నర్‌గా కెరీర్ మొదలెట్టిన స్మిత్, 2011 వరల్డ్ కప్‌లో 6 మ్యాచులు ఆడాడు. బ్యాటింగ్‌లో 51 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, బౌలింగ్‌లో మాత్రం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.
కేన్ విలియంసన్: 2023 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు కేన్ విలియంసన్. 2011 వన్డే వరల్డ్ కప్‌లో కెనడాతో మ్యాచ్‌లో 34 పరుగులు చేసిన విలియంసన్, శ్రీలంకతో మ్యాచ్‌లో 5 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో క్వార్టర్ ఫైనల్‌లో 38 పరుగులు చేసిన కేన్, శ్రీలంకతో సెమీ ఫైనల్‌లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..
టిమ్ సౌథీ: న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ, 2011 వన్డే వరల్డ్ కప్‌లో 18 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. గాయంతో బాధపడుతున్న టిమ్ సౌథీ, ప్రపంచ కప్ సమయానికి పూర్తిగా కోలుకుంటాడని ఆశపడుతోంది న్యూజిలాండ్ జట్టు..
shakib
షకీబ్ అల్ హసన్: 2011 వన్డే వరల్డ్ కప్‌లో కెప్టెన్సీ చేసి, 2023లోనూ కెప్టెన్సీ చేయబోతున్న ఒకే ఒక్కడు షకీబ్ అల్ హసన్. 2011 ప్రపంచ కప్‌లో 6 మ్యాచులు ఆడి 142 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్, 8 వికెట్లు తీశాడు.
mushfiqur rahim
ముస్తాఫికర్ రహీం: బంగ్లాదేశ్ సీనియర్ వికెట్ కీపర్ ముస్తాఫికర్ రహీం, 2011 వన్డే వరల్డ్ కప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. 2011 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ గ్రూప్ స్టేజీ నుంచి నిష్కమించింది. దీంతో ప్రపంచ కప్ తర్వాత షకీబ్ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు ముస్తాఫికర్ రహీం...
అదిల్ రషీద్: ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్, 2011 వన్డే వరల్డ్ కప్‌లో 11 వికెట్లు పడగొట్టాడు. 2019 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అదిల్ రషీద్, 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌కి కీ ప్లేయర్ కాబోతున్నాడు..