టీమిండియాకి అసలైన ఛాలెంజ్ ఆ మూడు జట్లతోనే... సెంటిమెంట్లను బ్రేక్ చేయగలదా...

First Published | Sep 29, 2023, 1:16 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా హాట్ ఫెవరెట్. ఆసియా కప్, ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచిన ఉత్సాహంతో స్వదేశంలో ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. అయితే ప్రపంచ కప్‌లో టీమిండియాకి మూడు మ్యాచులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి..
 

India vs Australia

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. ఇప్పటికే ఆసీస్‌పై వన్డే సిరీస్ గెలిచినా, అది వరల్డ్ కప్ మ్యాచ్‌తో సమానం కాదు. ఎందుకంటే ప్రపంచ కప్ అంటే ఆస్ట్రేలియా ఆటతీరు పూర్తిగా మారిపోతుంది..

మూడో వన్డేలో భారత బ్యాటర్లను ఆస్ట్రేలియా పార్ట్ టైం స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. వరల్డ్ కప్‌లో మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్‌, ప్యాట్ కమ్మిన్స్, సీన్ అబ్బాట్ వంటి  టాప్ క్లాస్ ఆసీస్ బౌలర్లను టీమిండియా ఎలా ఎదుర్కొంటారనేది కీలకంగా మారుతుంది..

Latest Videos


ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ గెలిస్తే, ఆ ఉత్సాహం, ఎనర్జీ మిగిలిన మ్యాచులకు బాగా కలిసి వస్తుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాతో జరిగిన గత 6 వన్డేల్లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ప్రపంచ కప్‌లో మొదటి మ్యాచ్‌లోనే బోణీ కొట్టాలంటే రోహిత్ దీన్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది..

ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ తర్వాత అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో ఆడే మ్యాచ్, టీమిండియాకి చాలా ముఖ్యమైనది. ప్రపంచ కప్ గెలవకపోయినా పర్లేదు, పాక్‌తో మ్యాచ్ మాత్రం తప్పక గెలవాలని కోరుకునే లక్షన్నర మంది జనాల మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది. ఆ ప్రెషర్‌ని టీమిండియా గెలవాల్సి ఉంటుంది..
 

పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి టీమిండియాకి అస్సలు కలిసి రాని అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో, టీవీ అంపైర్‌గా వ్యవహరించబోతున్నాడు.

2014 నుంచి 2023 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ దాకా రిచర్డ్ కెటిల్‌బరో, అంపైర్‌గా ఉన్న ప్రతీ మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడింది. ఇప్పుడు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి తీరాల్సిందే..

ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ని కాస్త కష్టపడితే దాటేయొచ్చు. ఆ తర్వాత అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో మ్యాచ్ కూడా టీమిండియాకి చాలా అవసరం. ఎందుకంటే 2003 నుంచి న్యూజిలాండ్‌పై ఒక్క ఐసీసీ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది భారత జట్టు..

2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన భారత జట్టు, 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ కివీస్ చేతుల్లో ఓడింది. 2021 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కాబట్టి ఈసారి టీమిండియా, ఈ సెంటిమెంట్‌ని కూడా అధిగమించి తీరాల్సిందే... 

India vs Pakistan

న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో మ్యాచులు ఆడనుంది టీమిండయా. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, కివీస్‌పై గెలిస్తే మిగిలిన టీమ్స్‌పై గెలవడం టీమిండియాకి పెద్ద కష్టమేమీ కాదు. స్వదేశంలో ఈ టీమ్స్‌పై భారత్‌కి మంచి రికార్డు కూడా ఉంది. 

click me!