ఈ తరంలో బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అతనే! ఆ వికెట్ త్వరగా దక్కితే... స్టీవ్ స్మిత్‌పై విరాట్ కోహ్లీ కామెంట్..

Published : Jun 07, 2023, 06:15 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మరోసారి ప్రత్యర్థులుగా తలబడబోతున్నారు ఫ్యాబ్ 4లో ముందుండే విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్...  ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ బ్యాటర్ అనే ప్రశ్న మీద ఎన్నో రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది..

PREV
15
ఈ తరంలో బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అతనే!  ఆ వికెట్ త్వరగా దక్కితే... స్టీవ్ స్మిత్‌పై విరాట్ కోహ్లీ కామెంట్..
Steve Smith

గత 13 ఏళ్లలో తటస్థ వేదిక మీద ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి. చివరిగా 2010లో పాకిస్తాన్‌తో లార్డ్స్ టెస్టు మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా. ఆ మ్యాచ్‌లో టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన స్టీవ్ స్మిత్... ఆసీస్‌కి టెస్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు..

25

96 టెస్టులు ఆడి 59.80 సగటుతో 8792 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, సెంచరీలతో ప్రస్తుత తరంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. జో రూట్ 29 టెస్టు సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్ 28 సెంచరీలతో ఉన్నారు..

35
Steve Smith

‘నా దృష్టిలో ఈ తరంలో బెస్ట్ టెస్టు ప్లేయర్ స్టీవ్ స్మిత్. టెస్టులకు తగ్గట్టుగా తనను తాను మలుచుకోవడంలో స్టీవ్ స్మిత్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఏ తరంలో అయినా 85-90 టెస్టులు ఆడిన తర్వాత 60 సగటు ఉందంటే అది మామూలు విషయం కాదు...

45
Steve Smith

ఎంతో నిలకడగా పరుగులు చేస్తుంటే కానీ ఇలాంటి ఫీట్ సాధించలేం. గత 10 ఏళ్లలో స్టీవ్ స్మిత్‌లా టెస్టుల్లో పరుగులు చేస్తున్న ప్లేయర్‌ని నేనైతే చూడలేదు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ ఇద్దరూ కీలకం..

55
Virat Kohli-Steve Smith

ఇంగ్లాండ్‌లో స్టీవ్ స్మిత్‌కి చక్కని రికార్డు ఉంది. భారత జట్టుపై కూడా ఇంతకుముందు చాలా పరుగులు చేశాడు. అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే, మాకు మ్యాచ్‌లో పట్టు సాధించే అవకాశం అంత త్వరగా వస్తుంది. అతను మ్యాచ్ విన్నర్..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ...

Read more Photos on
click me!

Recommended Stories