KL Rahul
ఫామ్‌లో లేని కెఎల్ రాహుల్‌ని తప్పించి, రిజర్వు బెంచ్‌కే పరిమితమైన రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ఆడిస్తే టీమిండియా బెటర్ పర్ఫామెన్స్ ఇస్తుందని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. పంత్ కాకపోతే దీపక్ హుడాని ఓపెనర్‌గా చేసినా పర్లేదు కానీ ఇలా ఊరికే వికెట్ పారేసుకుంటున్న కెఎల్ రాహుల్‌ని కొనసాగించడం వల్ల లాభం లేదని అంటున్నారు...
KL Rahul
వరుసగా ఐపీఎల్ మూడు సీజన్లలో 600+ పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్. ఐపీఎల్ 2020 సీజన్‌లో అయితే 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. ఐపీఎల్ 2021లో ఆరెంజ్ క్యాప్‌ని జస్ట్ మిస్ చేసుకున్న రాహుల్, 2022 సీజన్‌లోనూ టాప్ 3లో పోటీపడ్డాడు...
KL Rahul
‘ఐపీఎల్‌లో కెఎల్ రాహుల్ బాగా ఆడతాడు. అందులో అతను కెప్టెన్ అవ్వడం వల్లనో, లేక బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉన్న మార్పుల వల్లనో తెలీదు కానీ అప్పుడు కెఎల్ రాహుల్ బ్యాటింగ్‌లో చాలా మార్పు వస్తుంది. అతను ఎంతో బాధ్యతగా 20 ఓవర్లు బ్యాటింగ్ చేయలని ముందుగా డిసైడ్ అయినట్టు కనిపిస్తాడు...
Image credit: Getty
ఐపీఎల్‌లో టీమ్‌లో ఉన్న ప్లేయర్లలో అతనే బెస్ట్ ప్లేయర్. కెప్టెన్ కూడా. అందుకే వికెట్ పారేసుకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకుని ఆడతాడు. టీమిండియా విషయానికి వచ్చేసరికి అలా కాదు. నాన్ స్ట్రైయికింగ్‌లో రోహిత్ శర్మ ఉంటాడు...
Image credit: PTI
వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ వస్తాడు, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా... ఇలా వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ లైనప్ ఉంది. కాబట్టి కెఎల్ రాహుల్ చాలా కూల్ అయిపోతాడు. అదే అతని ఆటను ప్రభావితం చేస్తోంది...
Image credit: Getty
పవర్ ప్లేలో కెఎల్ రాహుల్‌ని సైలెంట్‌గా ఉంచడం చాలా కష్టమైన పని. ఏ బౌలర్ అనేది చూడకుండా షాట్స్ ఆడతాడు. టీమిండియా నుంచి ఐపీఎల్‌కీ వచ్చేసరికి అతని బ్యాటింగ్‌లో మార్పు కనిపిస్తుంది. అతను అలా ఫీల్ అవుతున్నాడు. దీనికి కారణం కోచింగ్ స్టాఫ్ చేస్తున్న తప్పే...
KL Rahul
నేను కోచ్‌గా ఉన్నప్పుడు టీమిండియాకి కానీ, పంజాబ్ కింగ్స్‌కి కానీ కెఎల్ రాహుల్‌కి ఒక్కటే చెప్పేవాడిని. టీమ్‌లో అతని రోల్ ఏంటో పూర్తి క్లారిటీ ఇచ్చేవాడిని. అందుకే అతను సూపర్ సక్సెస్ అయ్యాడు కూడా. కానీ ఇప్పుడు అతనిలో ఆ క్లారిటీ మిస్ అయినట్టు ఉంది...
KL Rahul
అతను ఐపీఎల్‌లో ఆడినట్టే, టీమిండియాకి ఆడాలంటే అది కోచ్‌ల చేతుల్లోనే ఉంది. కెఎల్ రాహుల్ నుంచి ఏం ఆశిస్తున్నారో క్లియర్‌గా చెప్పండి. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో నెట్ రన్‌రేట్ కావాల్సిన సమయంలో 42 బంతుల్లో 98 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు...
ఫ్రాంఛైజీ టీమ్‌కి అలా ఆడగలిగినప్పుడు టీమిండియాకి ఆడలేడా? ఐపీఎల్‌లో బాధ్యత తీసుకున్నట్టే, టీమిండియాలోనూ బాధ్యత తీసుకోవాలి... బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయాలంటే కెప్టెన్సీయే కావాల్సిన పని లేదు. ఆ విషయాన్ని రాహుల్‌కి అర్థమయ్యేలా తెలియచేయాలి...
K L Rahul
ఐపీఎల్‌లో ఆడుతున్నా కదా, ద్వైపాక్షిక సిరీసుల్లో ఆడుతున్నా కదా... అది చాలదా! టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి అని కెఎల్ రాహుల్ అనుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి ప్లేస్‌కి గ్యారెంటీ లేదు... ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే...