15 ఏళ్ల నుంచి రోహిత్‌తో కలిసి ఆడుతున్నా! ఎప్పుడూ అలా చేయలేదు.. - విరాట్ కోహ్లీ

Chinthakindhi Ramu | Published : Nov 7, 2023 9:43 PM
Google News Follow Us

విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ. టీ20 కెప్టెన్సీ నుంచి రిటైరైన విరాట్, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించబడ్డాడు. ఆ కోపంతో టెస్టు కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చాడు..
 

18
15 ఏళ్ల నుంచి రోహిత్‌తో కలిసి ఆడుతున్నా! ఎప్పుడూ అలా చేయలేదు.. - విరాట్ కోహ్లీ

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఆరు నెలల పాటు పరుగులు చేయడానికి తెగ కష్టపడిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు..

28

2022 ఆగస్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకడిగా నిలిచిన విరాట్ కోహ్లీ, గత 15 నెలల్లో 9 సెంచరీలు నమోదు చేశాడు..

38

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి, కెరీర్ బెస్ట్ టీ20 ఇన్నింగ్స్‌లో టీమిండియాని గెలిపించాడు విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ పరుగెత్తుకుంటూ వచ్చి విరాట్‌ని భుజాలపైకి ఎత్తుకుని సెలబ్రేట్ చేసుకున్నాడు..

Related Articles

48
India vs Pakistan

‘రోహిత్ శర్మతో కలిసి దాదాపు 15 ఏళ్ల నుంచి ఆడుతున్నా. అయితే అతను ఎప్పుడూ ఇలా నాతో చేయలేదు. అతను ఎప్పుడూ ఏదీ అంత ఈజీగా ఎక్స్‌ప్రెస్ చేయడు..

58
India vs Pakistan

ఆ రోజు ఆ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ రియాక్షన్ చాలా సహజసిద్ధంగా వచ్చింది. ఆ మ్యాచ్‌ని అంతా బాగా ఎంజాయ్ చేశాం. ఆ మూమెంట్‌ని ఎప్పటికీ మరిచిపోలేను..

68

పాకిస్తాన్ బౌలర్లను ఫేస్ చేసేందుకు ప్రిపరేషన్స్‌కి ఎక్స్‌ట్రా టైం కేటాయించా. 2021 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఓటమిని బుర్రలోకి రానివ్వలేదు. రివెంజ్ కోసం ఆడాలని అనుకోలేదు..

78

ఆ ఓటమి అస్సలు ఊహించలేదు. ఏ మ్యాచ్ గెలుస్తామో, ఏ మ్యాచ్ ఓడిపోతామో ఎవ్వరూ చెప్పలేరు. అయిపోయిన మ్యాచ్ గురించి ఆలోచిస్తే, ప్రెషర్ పెరుగుతుంది తప్ప, ఎలాంటి ఉపయోగడం ఉండదు...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
 

88
Image credit: Getty

2022 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన స్ట్రైయిట్ సిక్సర్‌ని ‘షాట్ ఆఫ్ ది సెంచరీ’గా అభివర్ణించింది ఐసీసీ.. 
 

Recommended Photos