జింబాబ్వేపై ఓడి సెమీస్ వెళ్లాం! ఇప్పుడు కూడా అంతే... పాకిస్తాన్‌ క్రికెట్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ కామెంట్స్..

First Published | Nov 7, 2023, 3:12 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో నెగ్గిన పాకిస్తాన్, ఆ తర్వాత వరుసగా 4 మ్యాచుల్లో ఓడింది. బంగ్లాదేశ్‌పై గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చిన పాక్, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో లక్కీగా విజయాన్ని అందుకుంది..

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 401 పరుగుల భారీ స్కోరు చేసినా వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి ఓవర్ల పాటు సాగలేదు. 
 

వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి డీఎల్‌ఎస్ విధానం ప్రకారం చేయాల్సిన పరుగుల కంటే 21 పరుగులు ఎక్కువగా చేయడంతో పాకిస్తాన్‌కి విజయం దక్కింది..
 


New Zealand vs Pakistan

పూర్తి ఓవర్ల పాటు మ్యాచ్ సాగి ఉంటే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుపు దాదాపు అసాధ్యమే. ఈ మ్యాచ్ ఓడి ఉంటే పాకిస్తాన్ సెమీస్ ఛాన్సులు పూర్తిగా ఆవిరి అయ్యి ఉండేవి..
 

Pakistan Cricket Team

‘మేం ఇంకా సెమీ ఫైనల్ వెళ్తామనే నమ్మకం ఉంది. 2022 టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే చేతుల్లో ఓడిన తర్వాత కూడా సెమీస్‌కి వెళ్లాం..
 

Pakistan

అందుకే ఈసారి కూడా దేవుడు కరుణిస్తే, సెమీ ఫైనల్‌కి వెళ్తామని అనిపిస్తోంది.చివరి మ్యాచ్‌లో బాగా ఆడితే సరిపోతుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాం. 
 

Pakistan v Bangladesh

చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారీ విజయం అందుకుంటే మేం సెమీస్ చేరగలం. ఫకార్ జమాన్ జట్టులోకి వచ్చిన తర్వాత టీమ్ అద్భుతంగా ఆడుతోంది. కొన్నిసార్లు టీమ్‌కి కావాల్సిన మోటివేషన్ ఒక్క ప్లేయర్ తెస్తాడు..
 

ఫకార్ జమాన్‌ రాకతో టాపార్డర్ బలంగా మారింది. ఆరంభంలో అతను లేకపోవడం వల్ల కొన్ని మ్యాచులు ఓడిపోయాం. ఇప్పుడతను వచ్చేశాడు, మా బ్యాటింగ్ పటిష్టంగా మారింది..’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్.. 
 

Pakistan vs Bangladesh

2022 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఓడిన పాకిస్తాన్, జింబాబ్వేతో మ్యాచ్‌ని 1 పరుగు తేడాతో ఓడిపోయింది. అయితే సౌతాఫ్రికా చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతుల్లో ఓడిపోవడంతో లక్కీగా సెమీస్ చేరిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌ని ఓడించి ఫైనల్‌కి వెళ్లింది..
 

Latest Videos

click me!