సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి, వన్డేల్లో 49 సెంచరీల సచిన్ రికార్డును అందుకున్నాడు. అయితే ఈ సెంచరీ చేయడానికి 119 బంతులు వాడుకున్నాడు విరాట్ కోహ్లీ..
విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో వచ్చిన స్లోయెస్ట్ సెంచరీ ఇదే. ఇంతకుముందు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ 95 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సెంచరీ కోసం ప్రయత్నించి అవుట్ అయ్యాడు..
26
Virat Kohli-Mohammed Hafeez
‘విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో సెల్ఫిష్‌నెస్ (స్వార్థం) కనిపిస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో విరాట్ ఇలా బ్యాటింగ్ చేయడం ఇది మూడోసారి. 49వ ఓవర్‌లో భారీ షాట్లు ఆడకుండా సెంచరీ కోసం సింగిల్ తీశాడు...
36
Virat Kohli-Ravindra Jadeja
రోహిత్ శర్మ కూడా కావాలనుకుంటే ఇలా స్వార్థంగా రికార్డుల కోసం ఆడొచ్చు. కానీ అలా ఆడలేదు. రోహిత్, టీమ్ కోసం ఆడుతున్నాడు, అతని కోసం కాదు.. ’ అంటూ వ్యాఖ్యానించాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్..
46
Virat Kohli
మహ్మద్ హఫీజ్ వ్యాఖ్యలపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ వాగన్ ఘాటుగా స్పందించాడు. ‘హఫీజ్.. ఇక చాలు ఆగు! భారత జట్టు ఇప్పటిదాకా ఆడిన 8 జట్లను చిత్తు చేసి విజయాలు అందుకుంది..
56
విరాట్ కోహ్లీ ఇప్పటికి 49 వన్డే సెంచరీలు చేశాడు. ఇలాంటి పిచ్ మీద అతను 44 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. అది అంత తేలికైన విషయం కాదు.
66
అతని జట్టు 200 తేడాతో విజయం అందుకుంది. కాబట్టి ఇప్పటికైనా కోహ్లీ మీద ఏడవడం మానుకోండి. ఇదంతా చెత్త వాగుడు..’ అంటూ ట్వీట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాగన్..