విరాట్ కోహ్లీ మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తిస్తున్నాడు, టీమిండియా కెప్టెన్‌కి... గౌతమ్ గంభీర్...

First Published Jan 14, 2022, 3:41 PM IST

కేప్ టౌన్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్‌ఎస్‌పై వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. అంపైర్ అవుట్‌గా ప్రకటించిన తర్వాత బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు చూపించడంపై విరాట్ అండ్ టీమ్ అసహనం వ్యక్తం చేశారు...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా స్టంప్ మైక్ దగ్గరికి వెళ్లి, థర్డ్ అంపైర్‌పై కామెంట్లతో అసహనం వ్యక్తం చేశారు...

ఈ ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ‘టెక్నాలజీ మన చేతుల్లో ఉండదు. ఎల్బీడబ్ల్యూలో నాటౌట్‌గా తేలిన డీన్ ఎల్గర్, ఆ తర్వాత క్యాచ్‌కి అవుట్ అయ్యాడు కదా...

కావాలంటే వాళ్లు డీన్ ఎల్గర్ బ్యాటుకి తగల్లేదని చూపించొచ్చు. మయాంక్ అగర్వాల్ అవుట్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఎల్గర్ నీలా ప్రవర్తించలేదు కదా...

టీమిండియాకి కెప్టెన్‌గా ఉంటూ ఇలా చిన్నపిల్లల్లా ఛీటింగ్ చేస్తున్నారని ఆరోపించడం జనాలకు నచ్చకపోవచ్చు....’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డార్ల్ కుల్లినన్ కూడా కోహ్లీ ప్రవర్తనను తప్పుబట్టాడు. ‘విరాట్ కోహ్లీ ఇలా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు.. అతను ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉంటాడు...

క్రికెట్ ప్రపంచం విరాట్ కోహ్లీకి దాసోహం అంటుంది. ఎందుకంటే అతను ఇండియాలో పవర్ హౌస్ లాంటోడు. కానీ నాకు అతని ప్రవర్తన ఏ మాత్రం నచ్చదు...

విరాట్ కోహ్లీ అంటే నాకు ఇష్టం. అతని ఆటంటే ఇష్టం. అతని ఆటతీరు మరీ ఇష్టం. కానీ గ్రౌండ్‌లో అతని ప్రవర్తన మాత్రం చాలాసార్లు సరిగ్గా ఉండదు... అదే నాకు ఏ మాత్రం నచ్చదు...’ అంటూ కామెంట్ చేశాడు డార్ల్ కుల్లినన్...

‘ప్రత్యర్థిపై కాకుండా మీ టీమ్‌పైన కూడా ఫోకస్ పెట్టండి, వాళ్లు బాల్‌ను ఎలా షైన్ చేస్తున్నారో చూడండి. ఎప్పుడూ పక్కనోళ్లపై ఎందుకు ఏడుస్తారు...’ అంటూ స్టంప్ మైక్‌లో చెప్పాడు విరాట్ కోహ్లీ... 
 

అంతేకాకుండా ‘వికెట్లు కావాలంటే కేవలం క్యాచులు పట్టుకోవాలి, లేదా బౌల్డ్ చేయాలి... మరో దారి లేదు...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

click me!