మాది తొండాట కాదు, వాళ్లదే ఫ్రస్టేషన్... డీన్ ఎల్గర్ అవుట్‌పై లుంగి ఎంగిడి...

Published : Jan 14, 2022, 01:37 PM IST

కేప్‌ టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ అవుట్ బాల్ ట్రాకింగ్‌ విషయంలో వివాదం రేగిన విషయం తెలిసిందే. సిరీస్‌ను కాపాడుకునేందుకు బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని తప్పుగా వాడి, ఛీటింగ్ చేశారని ఆరోపించారు భారత ప్లేయర్లు...

PREV
112
మాది తొండాట కాదు, వాళ్లదే ఫ్రస్టేషన్... డీన్ ఎల్గర్ అవుట్‌పై లుంగి ఎంగిడి...

30 ఏళ్లుగా సౌతాఫ్రికా గడ్డ మీద టెస్టు సిరీస్ గెలవలేకపోయింది భారత జట్టు. ఈ సారి ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవడమే లక్ష్యంగా సఫారీ గడ్డపై అడుగుపెట్టింది. అయితే సిరీస్‌ను కాపాడుకోవడానికి సౌతాఫ్రికా దొంగదారి పడుతోందని ట్రోల్స్ వచ్చాయి...

212

మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 198 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 13 పరుగుల ఆధిక్యంతో కలిసి సౌతాఫ్రికా ముందు 212 పరుగుల టార్గెట్‌ని పెట్టింది...

312

22 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌ను మహ్మద్ షమీ అవుట్ చేయడంతో 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా...

412

ఈ దశలో జట్టు స్కోరు 60 పరుగులు ఉన్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు ప్రకటించాడు ఫీల్డ్ అంపైర్...

512

అయితే వెంటనే డీన్ ఎల్గర్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టుగా చూపించింది...

612

బేసిక్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ఎవ్వరికైనా ఆ బంతి వికెట్లను తాకుతుందని తెలుస్తుంది. కనీసం అంపైర్ కాల్స్‌గా అయినా అవుతుందని అర్థం అవుతుంది...

712

విరాట్ కోహ్లీతో పాటు అవుట్‌గా చెప్పిన అంపైర్ ఎరాస్మస్ కూడా ‘దిస్ ఇజ్ ఇంపాజిబుల్’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం...

812

తాజాగా ఈ సంఘటనపై సౌతాఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడి స్పందించాడు. ‘వాళ్లు కొంచెం ఫ్రస్టేసన్‌కి గురయ్యారు. ఎందుకంటే డీన్ ఎల్గర్, పీటర్సన్ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు...

912

వికెట్లు పడకపోవడం, మ్యాచ్ చేజారిపోతుందేమోననే భయంలో వారిలో ఈ రకమైన ఎమోషన్స్ సహజమే కదా... మేం డీఆర్‌ఎస్ నిర్ణయాన్ని నమ్ముతున్నాం...

1012

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో డీఆర్ఎస్ వాడుతున్నారు. మ్యాచ్ ఇంకా మా చేతుల్లో నుంచి చేజారిపోలేదని నమ్ముతున్నాం’ అంటూ కామెంట్ చేశాడు లుంగి ఎంగిడి...

1112

థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్, స్టంప్ మైక్ దగ్గరికి వచ్చి ‘సూపర్ స్టోర్‌లో గెలవాలనుకుంటే కొంచెం మంచి మార్గాలు వెతుక్కుంటే బెటర్’ అంటూ  కామెంట్ చేశాడు...

1212

భారత సారథి విరాట్ కోహ్లీ కూడా... ‘ప్రత్యర్థిపై కాకుండా మీ టీమ్‌ని పటిష్టంగా చేయడంపై ఫోకస్ పెట్టండి... ఎప్పుడూ పక్కనొళ్లని పట్టుకోవాలని చూస్తారు...’ అంటూ స్టంప్ మైక్‌లో చెప్పాడు... ‘వికెట్లు కావాలంటే కేవలం క్యాచులు పట్టుకోవాలి, లేదా వికెట్లు తీయాలి... మరోదారి లేదు...’ అంటూ గట్టిగానే చెప్పాడు విరాట్ కోహ్లీ...

Read more Photos on
click me!

Recommended Stories