అదే జరిగితే విరాట్ కోహ్లీపై నిషేధం పడే అవకాశం... థర్డ్ అంపైర్ నిర్ణయంపై...

First Published Jan 14, 2022, 2:45 PM IST

ఏ క్రీడలో అయినా పారదర్శకత ప్రధానమైన కొలమానం. పరిస్థితులను వాడుకుని, టెక్నాలజీని అడ్డుపెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే, అది తొండాటే అవుతుంది. ఇప్పుడు కేప్‌ టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఓ సంఘటన ఇలాంటి చర్చను లేవనెత్తింది...

రెండో ఇన్నింగ్స్‌లో 212 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సౌతాఫ్రికా తొలి వికెట్‌ని త్వరగా కోల్పోయింది. అయితే ఆ తర్వాత 60 పరుగుల వద్ద డీన్ ఎల్గర్‌ను అంపైర్‌ అవుట్‌గా ప్రకటించడం, థర్డ్ అంపైర్ నాటౌట్‌గా తేల్చడం వివాదాస్పదమైంది...

బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని తప్పుగా వాడి టెస్టు సిరీస్‌ను కాపాడుకోవాలని సౌతాఫ్రికా ప్రయత్నిస్తోందని భారత జట్టు ప్లేయర్లు బహిరంగంగానే ఆరోపించారు...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్... స్టంప్ మైక్ దగ్గరికి వచ్చి థర్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశారు...

‘మ్యాచ్ గెలవాలనుకుంటే దానికి మంచి పద్ధతులు ఎంచుకుంటే బెటర్...’ అని రవిచంద్రన్ అశ్విన్ అంటే, ‘మా పదకొండు మందిని అవుట్ చేసేందుకు దేశామంతా కలిసి ఆడుతున్నట్టుంది...’ అంటూ కామెంట్ చేశాడు కెఎల్ రాహుల్...

‘ప్రత్యర్థిపై కాకుండా మీ టీమ్‌పైన కూడా ఫోకస్ పెట్టండి, వాళ్లు బాల్‌ను ఎలా షైన్ చేస్తున్నారో చూడండి. ఎప్పుడూ పక్కనోళ్లపై ఎందుకు ఏడుస్తారు...’ అంటూ స్టంప్ మైక్‌లో చెప్పాడు విరాట్ కోహ్లీ... 

అంతేకాకుండా ‘వికెట్లు కావాలంటే కేవలం క్యాచులు పట్టుకోవాలి, లేదా బౌల్డ్ చేయాలి... మరో దారి లేదు...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

ఈ కామెంట్ల కారణంగా విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. విరాట్ కోహ్లీ అండ్ టీమ్ ప్రవర్తన ఐసీసీ ఆర్టికల్ 2.8 నిబంధనకు విరుద్ధం...

ప్రత్యేక్షంగా కానీ, పరోక్షంగా కానీ అంతర్జాతీయ మ్యాచ్‌‌లో అంపైర్ల నిర్ణయంపై, థర్డ్ అంపైర్ నిర్ణయంపై కానీ అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆరోపణలు చేయడం క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తారు... 

ఇదే రుజువైతే థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ఛీటింగ్‌ అంటూ ఆరోపణలు చేసిన భారత ప్లేయర్లపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

అయితే ఫీల్డ్ అంపైర్‌తో పాటు థర్డ్ అంపైర్ కూడా టీమిండియా ప్లేయర్ల ప్రవర్తనపై ఇబ్బందిగా, క్రమశిక్షణారాహిత్యంగా ఫీలై ఐసీసీకి ఫిర్యాదు చేస్తే... ఈ విధంగా బ్యాన్ పడే ప్రమాదం ఉంది...

అయితే సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌ నాటౌట్‌గా టీవీ రిప్లైలో చూపించిన తర్వాత అంపైర్ ఎరాస్మస్ కూడా వికెట్లను మిస్ అవ్వడాన్ని నమ్మలేక ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే...

విరాట్ కోహ్లీపై నిషేధం పడినా పడకపోయినా అతని ప్రవర్తన కారణంగా మ్యాచ్ ఫీజులో కోత పడడం మాత్రం ఖాయమంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
 

click me!