కోహ్లీ కొడితేనే... వన్డేల్లో ఫామ్‌లోకి రాని విరాట్! 10 ఏళ్లలో అతి చెత్త బ్యాటింగ్...

First Published Dec 9, 2022, 5:06 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చాలా పెద్ద చర్చే జరిగింది. విరాట్ టీ20లకు పనికి రాడని, వరల్డ్ కప్ ఆడించడం కూడా వేస్ట్ అని అందరూ మాజీ క్రికెటర్లు. అయితే వారందరికీ తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు విరాట్. ఇప్పుడు సీన్ వన్డేల్లోకి మారింది...

ఆసియా కప్ 2022 టోర్నీలో రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 276 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో నాలుగు హాఫ్ సెంచరీలతో 296 పరుగులు చేసి... హైయెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు...

వన్డేల్లో మాత్రం విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో పర్యటనలో తొలి వన్డేలో 9 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండో వన్డేలో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. సీనియర్ బ్యాటర్ విరాట్ ఫెయిల్యూర్ టీమ్‌పై తీవ్రంగా ప్రభావం చూపుతోంది...

Image credit: Getty

కెఎల్ రాహుల్ తొలి వన్డేలో, రోహిత్ శర్మ రెండో వన్డేలో హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. శిఖర్ ధావన్, బంగ్లా టూర్‌లో రెండు వన్డేల్లో ఫెయిల్ అవుతున్నా... అంతకుముందు సిరీసుల్లో పరుగులు రాబట్టగలిగాడు...

విరాట్ కోహ్లీ, గత ఏడు వన్డేల్లో 20+ స్కోరు కూడా చేయలేకపోయాడు. గత ఏడు వన్డేల్లో విరాట్ కోహ్లీ 8, 18, 0, 16, 17, 9, 5 పరుగులు చేశాడు. నాలుగు సార్లు సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయాడు విరాట్...

2012 నుంచి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం చూపించిన విరాట్ కోహ్లీ... మూడేళ్లకు పైగా నెం.1 వన్డే బ్యాటర్‌గా నిలిచాడు. అయితే పేలవ ఫామ్ కారణంగా వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 10కి పడిపోయాడు...

Image credit: Getty

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టడంతో వన్డేలు ఎక్కువగా ఆడని విరాట్ కోహ్లీ, ఆడిన మ్యాచుల్లో ఆకట్టుకోలేకపోయాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది విరాట్ కోహ్లీ వన్డే సగటు 18.90గా ఉంది...

2012లో 68.40 సగటుతో వన్డేల్లో పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. 2013లో 52.83, 2014లో 58.55 సగటుతో పరుగులు చేశాడు. 2015లో మాత్రం విరాట్ వన్డే సగటు కాస్త దిగజారి 36.64కి పడిపోయింది...

virat

2016లో పీక్ స్టేజీకి వెళ్లిన విరాట్ కోహ్లీ... వన్డేల్లో 92.37 సగటుతో పరుగులు చేశాడు. 2017లో 76.84, 2018లో ఏకంగా 133.55 సగటుతో పరుగుల సాధించాడు విరాట్ కోహ్లీ..

2019లో 59.86 సగటుతో పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... కరోనా లాక్‌డౌన్ తర్వాత వన్డేలు ఆడడం తగ్గించేశాడు. 2020లో విరాట్ కోహ్లీ 6 వన్డేలు ఆడి 47.88 సగటుతో పరుగులు చేయగా 2021లో 43 సగటుతో పరుగులు చేశాడు...

Image credit: Getty

బంగ్లాదేశ్‌తో జరిగే ఆఖరి వన్డే, ఈ ఏడాదిలోనూ ఆఖరి వైట్ బాల్ మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతుంది టీమిండియా. దీంతో ఈ ఏడాది కోహ్లీ సగటు కనీసం 40+ దాటలన్నా, ఆఖరి వన్డేలో విరాట్ బ్యాటు నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ రావాలి.. 
  

click me!