విరాట్ కోహ్లీ తప్పేం చేయలేదు, ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి... రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

Published : Dec 14, 2021, 03:03 PM IST

టీమిండియా కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలోనూ అదరగొడుతున్నా, ఐసీసీ టైటిల్ గెలవలేదనే లోటే... విరాట్ కోహ్లీని విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. అదే కారణంగా విరాట్ కోహ్లీ నుంచి వన్డే కెప్టెన్సీని కూడా బలవంతంగా తీసుకుపోయింది బీసీసీఐ...

PREV
110
విరాట్ కోహ్లీ తప్పేం చేయలేదు, ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి... రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

విరాట్ కోహ్లీ నుంచి వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, ఐసీసీ టైటిల్స్ గెలవడమే లక్ష్యంగా జట్టును తయారుచేస్తానంటూ హామీ ఇస్తున్నాడు...

210

‘చివరిగా 2013లో మేం ఐసీసీ టైటిల్ గెలిచాం. ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత 8 ఏళ్లుగా ఐసీసీ గెలవలేకపోయాం...

310

నిజానికి ఐసీసీ టైటిల్ గెలవకపోవడంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పేం లేదు. ఎందుకంటే ప్రతీ టోర్నీకి ముందు టైటిల్ గెలవాలనే కసితో బరిలో దిగాం, టైటిల్ గెలవడానికి కావాల్సినవన్నీ చేశాం...

410

జట్టుగా ఆడాం, జట్టుగానే విజయాలను, పరాజయాలను అందుకున్నాం. అయితే టైటిల్ గెలవడానికి కావాల్సిన ఆ ఒక్క ఇంచును మాత్రం దాటలేకపోయాం...

510

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎప్పుడూ జట్టును ముందుండి నడిపించాడు. ఐసీసీ టైటిల్ గెలవకపోయినా ప్రతీ టోర్నీలో ఓ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా నూటికి నూరు శాతం ఇచ్చాడు...

610

ఐసీసీ టైటిల్ గెలవడానికి కావాల్సిన ఆ ఒక్క ఇంచును ఎలా దాటాలనేదానిపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలనుకుంటున్నాం. అది జరుగుతుంది...

710

అంతర్జాతీయ క్రికెట్‌ స్టార్ టీమ్‌గా నిలవాలంటే ఐసీసీ టైటిల్ గెలవాల్సిందే. ఏ జట్టుకైనా అదే నిజమైన ఛాలెంజ్. మేమంతా ప్రొఫెషనల్ క్రికెటర్లం...

810

విజయానికి కావాల్సిన ఆ ఒక్క మంచి అడుగు వేసేందుకు ఏం చేయాలో అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఐసీసీ టైటిల్స్ గెలవడానికి కావాల్సిన సరుకులన్నీ సమకూర్చుకుంటున్నాం...

910

వచ్చే ఏడాది నుంచి ప్రతీ యేటా ఓ వరల్డ్ కప్, ఐసీసీ టోర్నీ జరగబోతోంది. టీమిండియా ప్లేయర్‌గా, కెప్టెన్‌గా అవన్నీ గెలవాలని కోరుకుంటున్నా...

1010

అలాగని ప్లేయర్లు అంతా ఫైనల్ ఎలా గెలవాలని ఆలోచిస్తూ బుర్రలు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతీ మ్యాచ్‌పైన ఫోకస్ పెడుతూ ఉంటే, ఫైనల్ గోల్ ఎలా కొట్టాలో తర్వాతి విషయం...’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ...

Read more Photos on
click me!

Recommended Stories