Priyank Panchal: ఆయన ఏది చెప్పినా ఫాలో అయ్యాను.. టీమిండియా హెడ్ కోచే నా గురువు : ప్రియాంక్ పాంచల్

Published : Dec 14, 2021, 02:09 PM IST

Rahul Dravid: కీలక దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టు వన్డే సారథి రోహిత్ శర్మకు గాయం  కావడంతో  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అతడి స్థానంలో సౌరాష్ట్ర ఆటగాడు ప్రియాంక్ పాంచల్ ను  ఎంపిక చేసింది.    

PREV
17
Priyank Panchal: ఆయన ఏది చెప్పినా ఫాలో అయ్యాను.. టీమిండియా హెడ్ కోచే నా గురువు : ప్రియాంక్ పాంచల్

ఇన్నాళ్లు దేశవాళీ క్రికెట్ తో పాటు ఇండియా-ఏ జట్ల తరఫున ఆడుతూ అదరగొడుతున్న పాంచల్.. తనకు భారత సీనియర్ జట్టులో అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఇది తనకు నమ్మశక్యంగా లేదని చెప్పుకొచ్చాడు. 

27

అయితే తన ఎదుగుదలకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడే  కారణమని ఈ గుజరాతీ  క్రికెటర్ తెలిపాడు. తాను ఇండియా-ఏ కు ఆడుతున్న సమయంలో ద్రావిడ్ చెప్పిన విషయాలను తూచా తప్పకుండా ఫాలో అయ్యేవాడినని, తనలో కెప్టెన్ ఉన్నదని గుర్తించింది కూడా ఆయనేనని అన్నాడు. 

37

పాంచల్ మాట్లాడుతూ.. ‘నేను భారత-ఏ జట్టుకు ఎంపికైనప్పుడు చాలా సంతోషపడ్డాను. అదే సమయంలో చాలా భయపడ్డాను కూడా. ఆ టైంలో అప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా ఉన్న రాహుల్ సర్ నా దగ్గరకు వచ్చి ఏమీ భయపడకు.. మాములుగా ఉండుమని చెప్పారు. 

47

అంతేగాక.. నీలో సహజంగానే నాయకత్వ లక్షణాలున్నాయి. అందుకే నీకు కెప్టెన్సీ అప్పజెప్పారు. నువ్వు నీ ఆలోచనల్లో మార్పులేమీ చేసుకోవద్దు. ఇన్నాళ్లు దేశవాళీ క్రికెట్ లో ఎలా రాణించావో అలాగే ఆడు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కెప్టెన్ గా ఏ వ్యూహాలు అమలుచేశావో ఇక్కడా అవే అనుసరించుమని చెప్పారు..’ అని పాంచల్ తెలిపాడు. 

57

‘ద్రావిడ్ సార్ ఏదైనా చెబితే  నేను గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని. ఎందుకంటే ఆయన ఒక క్రికెటర్ గా సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చారు. అంతేగాక ఆయనకు ఎంతో అపారమైన అనుభవం కూడా ఉంది..’ అని చెప్పాడు. 

67

‘నేను అండర్-15 ఆటగాడిగా ఉన్నప్పట్నుంచే  ఎన్సీఏ లో ద్రావిడ్ సర్ ను చూస్తున్నాను. నా కెరీర్ మొత్తం ఆయనను ఫాలో అయ్యాను. ఇండియా-ఏ లో ఆడుతున్నప్పుడు ఆయన  మార్గదర్శకత్వంలో పనిచేయడం నా అదృష్టం..’ అని  పాంచల్ అన్నాడు. 

77


అహ్మదాబాద్ కు చెందిన 31 ఏండ్ల ప్రియాంక్ పాంచల్ దేశవాళీ క్రికెట్ లో గుజరాత్ తరఫున సుదీర్ఘ కాలంగా ఆడుతున్నాడు. 2008లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగ్రేటం చేసినా అతడికి ఇంతవరకు గుర్తింపు దక్కలేదు. ఇప్పటివరకు 100 దాకా ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పాంచల్.. 45.52 సగటుతో 7,011 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 24  శతకాలు, 25 అర్థ శతకాలు చేశాడు. అత్యధిక స్కోరు 314 నాటౌట్ గా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories