Ravi Shastri: అలా అనిపించినప్పుడు కోహ్లి పూర్తిగా తప్పుకుంటాడు.. కానీ..: రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్

Published : Nov 13, 2021, 10:14 AM IST

Virat Kohli: టీమిండియా వన్డే,  టెస్టు సారథి విరాట్ కోహ్లి పై మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సమీప భవిష్యత్తులో అతడు పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా సారథ్య బాధ్యతలు విరమించుకునే ఛాన్సుందని అన్నాడు. 

PREV
17
Ravi Shastri: అలా అనిపించినప్పుడు కోహ్లి పూర్తిగా తప్పుకుంటాడు.. కానీ..: రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్

టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి.. విరాట్ కోహ్లి కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా.. వరుసగా ఐదేండ్ల పాటు నంబర్ గా ఉన్నదని, అయితే తాను మానసికంగా అలసిపోతే మాత్రం కోహ్లి మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పాడు. 

27

కోచ్ గా బాధ్యతల నుంచి తప్పుకున్నాక రవిశాస్త్రి జాతీయ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.  ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు.. విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ వదులుకోవడం, వన్డే సారథ్య బాధ్యతలు కూడా వదులుకుంటాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

37

ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ..‘గత ఐదేండ్లుగా విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. తాను మానసికంగా అలసిపోయానని భావించినప్పుడు గానీ లేదా తన బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలని అనుకున్నప్పుడు గానీ కోహ్లి సమీప భవిష్యత్తులో కెప్టెన్సీని పూర్తిగా వదిలేసే అవకాశముంది.

47

అయితే అది ఇప్పట్లో మాత్రం జరుగకపోవచ్చు.  కానీ పరిమిత ఓవర్ల (వన్డేలు) క్రికెట్ లో మాత్రం కోహ్లి ఈ నిర్ణయం తీసుకునే అవకాశమైతే ఉంది. టెస్టు కెప్టెన్సీ పై దృష్టి సారించడానికకే అతడు టీ20 సారథ్యాన్ని వదులుకున్నాడు. 

57

త్వరలో బ్యాటింగ్ పై దృష్టి పెట్టేందుకు పూర్తిగా కెప్టెన్సీ నుంచిచ తప్పుకోవచ్చేమో.  విరాట్ మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన క్రికెటర్లు బ్యాటింగ్ పై శ్రద్ధ పెట్టేందుకు  నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు..’ అని రవిశాస్త్రి తెలిపాడు.

67

అంతేగాక..  కోహ్లి పరుగుల వేటలో ఆకలి మీద ఉన్నాడు. ప్రస్తుతమున్న జట్టులో అందరికంటే కోహ్లి ఫిట్ గా ఉన్నాడు. అందులో సందేహమే లేదు. మీరు శారీరకంగా ఫిట్ గా ఉన్నప్పుడు మీ కెరీర్ కూడా పెరుగుతుంది. టెస్టు క్రికెట్ లో  విరాట్ ఒక బ్రాండ్ అంబాసిడర్. అదే అతడిని టెస్టులలో కొనసాగేలా చేస్తున్నదని చెప్పుకొచ్చాడు. 

77

బయోబబుల్ కాలంలో ఆటగాళ్లు ఒత్తిడి బారిన పడటం సహజమని, అయితే వారికి ఈ సమయంలో విరామం చాలా అవసరమని తాను భావిస్తున్నానని రవిశాస్త్రి తెలిపాడు. ఐపీఎల్ తర్వాత ప్రపంచకప్ ఆడటం అనువైంది కాదనీ, కానీ కొవిడ్ కారణంగా రీషెడ్యూలు జరపడంతో అది అనివార్యమైందని అన్నాడు.  ఈ విషయంలో బీసీసీఐని నిందించడం తనకు ఇష్టం లేదని చెప్పాడు.

Read more Photos on
click me!

Recommended Stories