ధోనీ కాదు, విరాట్ కోహ్లీ భయపెట్టాడు! అతని టీమ్‌తో ఆడాలంటే... రికీ పాంటింగ్ కామెంట్...

First Published Jul 21, 2022, 11:05 AM IST

మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రికెట్ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్... భారత మాజీ సారథి విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. పేలవ ఫామ్‌తో కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రోజురోజుకీ దిగజారిపోతున్న వేళ, టీమ్‌కి అతని అవసరం ఎంతుందో చెబుతూ కామెంట్లు చేశాడు...

ఢిల్లీ క్యాపిటల్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్, కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకి రెండు వరల్డ్ కప్స్ అందించాడు. అలాగే ఆస్ట్రేలియా టీమ్‌ని టాప్ ‌లో నిలిపి, ఆసీస్‌తో ఆడాలంటేనే ప్రత్యర్థి జట్లు భయపడేలా చేశాడు...

‘నేను ఏ ప్రత్యర్థి కెప్టెన్ లేదా ప్లేయర్‌తో ఆడడానికి భయపడ్డానంటే అది కచ్ఛితంగా విరాట్ కోహ్లీయే. అతను భారత జట్టును నడిపించిన విధానం అసాధారణం. విరాట్ టీమ్‌లో ఉంటే, జట్టులో ఏదో తెలియని ఎనర్జీని నింపుతాడు...

Latest Videos


ఇప్పుడు అతను చాలా ఛాలెంజ్‌లను ఎదుర్కొంటున్నాడు. అయితే ప్రతీ గొప్ప ప్లేయర్ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసినవాళ్లే.. కెరీర్‌లో ఇది క్లిష్ట సమయం...

ఈ స్టేజీని దాటితేనే లెజెండరీ బ్యాటర్‌గా లేదా బౌలర్‌గా మారతారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి రావడానికి తానే పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి...   విరాట్ త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడు..

టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీని పక్కనబెట్టి, మరో ప్లేయర్‌కి చోటు ఇస్తే చాలా పెద్ద రిస్క్‌ని కోరితెచ్చుకున్నట్టే.. ఒకవేళ టీ20 వరల్డ్ కప్‌లో చోటు కోల్పోతే, తిరిగి జట్టులోకి రావడం విరాట్‌కి కష్టమైపోతుంది... తిరిగి విరాట్ కోహ్లీ టీమ్‌లోకి రావాలంటే, తన వాల్యూని తిరిగి నిరూపించుకోవాల్సి ఉంటుంది...

నేను భారత జట్టులో ఉండి ఉంటే, విరాట్ కోహ్లీని వరుసగా మ్యాచులు ఆడించేవాడిని. అతను ఎలాగైనా ఫామ్‌లోకి వచ్చేలా చూసేవాడిని. ఎందుకంటే విరాట్ కాన్ఫిడెన్స్‌తో ఆడితే అతను ఏం చేయగలడో నాకు బాగా తెలుసు...

నేను టీమిండియాకి కెప్టెన్‌గా ఉన్నా, కోచ్‌గా ఉన్నా విరాట్ కోహ్లీని కంఫర్టబుల్ జోన్‌లో పెట్టేందుకు ప్రయత్నించేవాడిని. అతను ఫామ్‌లోకి వచ్చి స్వేచ్ఛగా పరుగులు చేసేందుకు అవకాశం ఇచ్చేవాడిని... ’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...

మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టుతో ఆడేందుకు తాను భయపడేవాడినంటూ రికీ పాంటింగ్ చేసిన కామెంట్లు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకున్న తర్వాత బీసీసీఐ, అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకే టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు తెలిపాడు విరాట్ కోహ్లీ... బీసీసీఐ గుర్తించకపోయినా విరాట్ విలువను రికీ పాంటింగ్ గుర్తించాడని అంటున్నారు ఆయన అభిమానులు...

click me!