IND vs PAK: కామన్వెల్త్ క్రీడల్లో దాయాదుల సమరం.. మ్యాచ్ వివరాలివే..

Published : Jul 20, 2022, 02:53 PM IST

Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడలలో తొలిసారిగా క్రికెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిరకాల ప్రత్యర్థులు ఇండియా-పాకిస్తాన్ లు ఢీకొనబోతున్నాయి. 

PREV
17
IND vs PAK: కామన్వెల్త్ క్రీడల్లో దాయాదుల సమరం.. మ్యాచ్ వివరాలివే..

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు ఎప్పుడు మజానే.  ఆడుతున్నది పురుషులా..? మహిళలా..? అనే తేడా లేకుండా ఈ మ్యాచ్ చూడటానికి వేలాది మంది అభిమానులు ప్రేక్షకులకు పోటెత్తుతేలక్షలాది అభిమానులు టీవీల ముందు కూర్చుంటారు. 
 

27

అయితే ఇరు దేశాల సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరగడం లేదు. కానీ ఐసీసీ ఈవెంట్లలో ఇందుకు మినహాయింపు ఉంది. కొద్దిరోజుల్లోనే ఈ ఇరు జట్ల మధ్య ఆసక్తికర సమరానికి తెరలేవనుంది. 

37
Image credit: Wikimedia Commons

కామన్వెల్త్ క్రీడలలో భాగంగా చరిత్రలో తొలిసారి ఈ క్రీడలలో క్రికెట్ ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే.  అయితే ఈసారి మహిళల క్రికెట్ కు మాత్రమే అనుమతి లభించింది. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్హోమ్ లో జరుగబోయే ఈ క్రీడలలో క్రికెట్ ను టీ20 ఫార్మాట్ లో ఆడించనున్నారు. 

47

ఇక ఈ క్రీడలలో భారత్-పాక్ లు తలపడబోతున్నాయి. గ్రూప్-ఏ లో ఉన్న భారత్, పాకిస్తాన్ లు తమ తొలి మ్యాచ్ ను ఇతర జట్లతో ఆడతాయి. భారత్ తమ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా ను ఢీకొనబోతుండగా పాకిస్తాన్ బార్బోడస్ తో తలపడబోతున్నది. 

57

రెండో మ్యాచ్ లో ఈ ఇరు జట్లు కీలక పోరుకు దిగనున్నాయి. జుల 31 న  ఎడ్జబాస్టన్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తన్నది. 

67

ఈ మ్యాచ్ ను  సోనీ స్పోర్ట్స్  నెట్వర్క్ తో పాటు సోనీ లివ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు.  ఇదిలాఉండగా కామన్వెల్త్ లో తొలిసారి ప్రవేశపెట్టిన క్రికెట్ కు మంచి ఆదరణ ఉండనుందని ప్రేక్షకుల ఆసక్తిని బట్టి అంచనా వేయవచ్చు. 

77

కామన్వెల్త్ లో జరుగబోయే క్రికెట్ మ్యాచులను వీక్షించడానికి ఇప్పటికే 1.2 మిలియన్ (10.2 లక్షలు) టికెట్లను  విక్రయించినట్టు తెలుస్తున్నది. 

click me!

Recommended Stories