వన్డే సిరీస్‌కి విరాట్ కోహ్లీ దూరం, టెస్టు సిరీస్‌కి రోహిత్... ఆ ఇద్దరి మధ్య తారాస్థాయికి విభేదాలు...

Published : Dec 14, 2021, 09:31 AM IST

భారత క్రికెట్ టీమ్‌ డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం సరిగా లేనట్టు తెలుస్తోంది. సౌతాఫ్రికా టూర్‌కి ముందు గాయం కారణంగా రోహిత్ శర్మ, టెస్టు సిరీస్ మొత్తానికి దూరం కాగా, విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్‌ ఆడకూడదని నిర్ణయించుకున్నాడట...

PREV
111
వన్డే సిరీస్‌కి విరాట్ కోహ్లీ దూరం, టెస్టు సిరీస్‌కి రోహిత్... ఆ ఇద్దరి మధ్య తారాస్థాయికి విభేదాలు...

సౌతాఫ్రికా సిరీస్‌కి ముందు భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ క్యాంపులో పాల్గొన్న రోహిత్ శర్మ తీవ్రంగా గాయపడ్డాడు...

211

తొలి టెస్టు సమయానికి రోహిత్ శర్మ కోలుకుంటాడని వార్తలు ప్రచారం జరిగినా, పూర్తిగా టెస్టు సిరీస్ నుంచి అతను తప్పుకున్నట్టుగా ప్రకటించింది బీసీసీఐ...

311

రోహిత్ శర్మ స్థానంలో సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్- ఏ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రియాంక్ పంచల్‌కి టెస్టు టీమ్‌లో చోటు కల్పించారు సెలక్టర్లు...

411

తాజాగా సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కి విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడని సమాచారం. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ చాలా రోజుల ముందుగానే బీసీసీఐకి తెలియచేశాడట విరాట్...

511

విరాట్ కోహ్లీ కూతురు వామిక కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్‌ దగ్గరుండి చూసుకోవడానికే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడట. సౌతాఫ్రికా సిరీస్ ఖరారు కాకముందే బీసీసీఐకి ఈ విషయాన్ని తెలియచేశాడట...

611

అయితే టెస్టు సిరీస్‌కి రోహిత్ శర్మ, వన్డే సిరీస్‌కి విరాట్ కోహ్లీ దూరం కావడంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయని, అందుకే కలిసి ఆడేందుకు సిద్ధంగా లేరని సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి...

711

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రోహిత్ శర్మ దాదాపు ఐదేళ్ల పాటు ప్లేయర్‌గా ఆడాడు. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో ఆడడానికి విరాట్ కోహ్లీకి అహం అడ్డువస్తోందని అంటున్నారు హిట్ మ్యాన్ అభిమానులు...

811

టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ, వన్డేల్లో డిమాండ్ చేసి మరీ టీమిండియా కెప్టెన్సీ తీసుకున్న రోహిత్ శర్మ... టెస్టు సిరీస్‌కి ముందు గాయపడడం కూడా చాలా పెద్ద చర్చనీయాంశమైంది...

911

ఫిట్‌గా లేకుండా ఇలా మాటిమాటికీ జట్టుకి దూరమయ్యే వ్యక్తికి కెప్టెన్సీ ఎలా అప్పగిస్తారని, వయసైపోయిన రోహిత్ శర్మ కంటే రిషబ్ పంత్ లాంటి యువకుడికి కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుందని ట్రోల్ చేస్తున్నారు కోహ్లీ అభిమానులు...

1011

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఎలా ఆడతాడో చాలాసార్లు చూశారు... రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడో చూద్దామని ఆశించిన అభిమానులు మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే...

1111

సౌతాఫ్రికా టూర్ ముగిసిన తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కలిసి చూసే అవకాశం ఉంది... 

Read more Photos on
click me!

Recommended Stories