న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా ఐదో స్థానానికి విపరీతమైన పోటీ పెరిగిపోయింది. శ్రేయాస్ అయ్యర్ ఆరంగ్రేటం టెస్టులోనే అదరగొట్టడంతో అజింకా రహానే, హనుమ విహారి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది...
ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీ టెస్టులో పట్టువదలకుండా క్రీజులో వికెట్లకు అడ్డంగా నిలబడి, చారిత్రక డ్రాని అందించాడు హనుమ విహారి... అయితే ఆ టెస్టు తర్వాత హనుమ విహారికి మరో ఛాన్స్ దక్కలేదు...
211
స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కానీ, ఇంగ్లాండ్ టూర్‌లో కానీ హనుమ విహారికి ఒక్కసారి అవకాశం దక్కలేదు...
311
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో హనుమ విహారికి చోటు దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సౌతాఫ్రికా-ఏతో జరిగిన భారత్-ఏ సిరీస్‌లో హనుమ విహారికి అవకాశం దక్కింది...
411
ఈ టూర్‌లో మూడు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న హనుమ విహారికి, సౌతాఫ్రికా సిరీస్‌లోనూ అవకాశం కల్పించారు సెలక్టర్లు...
511
‘న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనే హనుమ విహారికి అవకాశం దక్కాల్సింది. అయితే అప్పుడు అతనికి చోటు దక్కలేదు. సౌతాఫ్రికా టూర్‌లో అతను అదరగొట్టాడు...
611
రెండో అనధికారిక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి విదేశీ పిచ్‌లపై విహారికి మంచి రికార్డు ఉంది...
711
అజింకా రహానే కాకుండా ఓ యువకుడికి ఐదో స్థానంలో అవకాశం ఇవ్వాలనుకుంటే హనుమ విహారి మంచి టెక్నిక్ ఉన్న ప్లేయర్.
811
విహారితో పోలిస్తే శ్రేయాస్ అయ్యర్ కాస్త దూకుడుగా ఆడతాడు...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...
911
‘హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్‌లలో ఎవరిని ఆడించాలని అనుకుంటే మాత్రం విహారి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఓవర్‌సీస్ పిచ్‌లపై విహారికి చాలా మంచి రికార్డు ఉంది...
1011
శ్రేయాస్ అయ్యర్‌కి పెద్దగా అంతర్జాతీయ అనుభవం కూడా లేదు. సౌతాఫ్రికా పిచ్‌లను అర్థం చేసుకోవడానికి అయ్యర్‌కి కాస్త సమయం పడుతుంది...
1111
విహారి అలా కాదు, అతను ఇప్పటికే సౌతాఫ్రికాలో రాణించగలనని నిరూపించుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లు ఉండే విండీస్‌లో సెంచరీ చేశాడు... కాబట్టి విహారిని ఆడించడమే సరైన నిర్ణయం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.