సంజూ శాంసన్ కెరీర్‌ని ఎవ్వరూ నాశనం చేయలేదు! అతనే నాశనం చేసుకున్నాడు.. - శ్రీశాంత్

Published : Sep 25, 2023, 12:18 PM IST

టీమిండియాలో చోటు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్లేయర్ సంజూ శాంసన్. గత రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో చోటు దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రకటించిన జట్టులోనూ చోటు దక్కలేదు...

PREV
16
సంజూ శాంసన్ కెరీర్‌ని ఎవ్వరూ నాశనం చేయలేదు! అతనే నాశనం చేసుకున్నాడు.. - శ్రీశాంత్
Sanju Samson

ఆసియా కప్ 2023 టోర్నీకి రిజర్వు ప్లేయర్‌గా ఎంపికైన సంజూ శాంసన్, కెఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. చైనాలో జరగబోయే ఆసియా క్రీడల్లోనూ సంజూకి చోటు ఇవ్వలేదు సెలక్టర్లు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ సంజూకి చోటు దక్కలేదు..

26
Sanju Samson

‘సంజూ శాంసన్‌కి చోటు ఇవ్వకపోవడం సరైన నిర్ణయమే. ఎందుకంటే ఎంత గొప్ప ప్లేయర్ అయినా తనని తాను అర్థం చేసుకోవడం చాలా అవసరం. గవాస్కర్ సర్, హర్షా భోగ్లే సర్, రవిశాస్త్రి సర్ అందరూ సంజూ శాంసన్‌ని ఎంతగానో పొగుడుతారు..

36
Sanju Samson Wicket

అతను టాలెంట్‌పైన, సత్తాపైన ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. అయితే అతను ఆడే విధానంతోనే సమస్య. పిచ్‌కి తగ్గట్టుగా తగ్గి ఆడమని ఎవ్వరూ చెప్పినా అతను పట్టించుకోడు. మొదటి బంతి నుంచి భారీ షాట్స్ ఆడాలనే యాటిట్యూడ్ మార్చుకోడు..

46

నేను అతన్ని కలిసినప్పుడు ఇదే చెప్పాను, సంజూ ప్లీజ్... వికెట్‌ని అర్థం చేసుకుని ఆడు. కాస్త ఆగి, ఆచి తూచి ఆడు. ప్రతీ బౌలర్‌కీ నీ వికెట్‌ని ఇచ్చేయకు. ప్రతీ సారీ వెళ్లగానే సిక్సర్ కొడతా అంటే అవకాశాలు రావు. ఏ బాల్‌కి ఎలా ఆడాలో తెలుసుకుని ఆడమని..

56
Sanju Samson and Ruturaj Gaikwad

అయినా అతను పట్టించుకోడు. మలయాలీలు అందరూ అతనికి సపోర్ట్‌గా నిలుస్తారు. అతనికి అవకాశాలు రావడం లేదని అంటారు. కానీ అతనికి అవకాశం వచ్చినప్పుడు ఏం చేశాడు? 10 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. కెప్టెన్‌గా కూడా చేశాడు... ఇప్పటిదాకా అతను బాగా ఆడిన సీజన్లు ఎన్ని...

66

సంజూ శాంసన్ కెరీర్‌ని ఎవ్వరూ నాశనం చేయలేదు. అతని కెరీర్‌ని ఇలా మార్చుకున్నది పూర్తిగా అతనే. తన కెరీర్ నాశనం అవ్వడానికి అతనే కారణం. టైం ఎవ్వరి కోసం ఆగదు. సమయం వచ్చినప్పుడు అందుకోవాలి. సానుభూతి సంపాదించుకోవడం తేలిక, ప్రశంసలు దక్కించుకోవడమే చాలా కష్టం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్..

click me!

Recommended Stories