విరాట్ కోహ్లీలోని ఆ రెండు లక్షణాలే, హీరోని చేశాయి... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా...

First Published Mar 2, 2021, 3:16 PM IST

విరాట్ కోహ్లీ... క్రికెట్ కెరీర్‌లో సెంచరీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ కెప్టెన్‌గా కెరీర్‌లో పీక్ స్టేజీని అనుభవిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు సాధించిన విజయాలు కూడా జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించిన కారణంగా కోహ్లీ ఖాతాలోనే చేరాయి. ఇన్‌స్టాలో 100 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్న కోహ్లీయే నేటి తరానికి హీరో అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా...

ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇన్‌స్టాలో 100 మిలియన్ల ఫాలోవర్ల మార్కును అందుకున్న విరాట్ కోహ్లీ, ట్విట్టర్‌లో 40 మిలియన్లు దాటి, 50 మిలియన్ల మార్కుకు దగ్గరవుతున్నాడు. ఈ రేంజ్‌ ఫాలోవర్లు సంపాదించుకున్న మొట్టమొదటి ఇండియన్ సెలబ్రిటీ విరాట్ కోహ్లీయే...
undefined
‘టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరు నాకెంతో నచ్చింది. అతను నేటి తరానికి అసలైన క్రికెట్ హీరో... ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించడానికి విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉండడు.
undefined
ఆఖరిదాకా పోరాడే తత్వం, ఓటమిని అంగీకరించని యాటిట్యూడ్... ఈ రెండింటి కారణంగానే విరాట్ కోహ్లీ అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు...
undefined
క్రికెట్‌ తర్వాత ఫోటోగ్రఫీని వ్యాపకంగా మలుచుకున్న స్టీవ్ వా... భారత క్రికెట్‌పై 60 నిమిషాల స్పెషల్ వీడియో రూపొందించారు. ఈ డాక్యుమెంటరీకి ఆయన పెట్టిన పేరు... ‘క్యాప్చరింగ్ క్రికెట్: స్టీవ్ వా ఇన్ ఇండియా’..
undefined
ఈ డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్టీవ్ వా... విరాట్ కోహ్లీ గురించి, టీమిండియా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘క్రికెట్, ఫోటోగ్రఫీ రెండు నాకిష్టమైన కళలు. అందుకే కెమెరాతో క్రికెట్‌ను బంధించడం అంటే మరీ ఇష్టం....
undefined
మొదటిసారి క్రికెటర్‌గా ఇండియా టూర్‌కి వచ్చినప్పుడే భారత్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఇక్కడి ప్రజలు క్రికెట్‌ను ఓ వేడుకలా ఎంజాయ్ చేస్తారు. క్రికెట్‌ను ఇంతలా ఇష్టపడే జనాన్ని చూసి ముందు నాకు ఆశ్చర్యం వేసింది...
undefined
ఇండియాలో ప్రతీ ప్రాంతం ఎంతో అద్భుతం. నాకు జీవితకాలంలో నిలిచిపోయే మధురానుభుతులను మిగిల్చావి... తాజ్‌మహల్‌తో పాటు ఢిల్లీ, కోల్‌కత్తా నగరాలు చుట్టేశాను.
undefined
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, మహారాజా లక్ష్మీవిలాస్ ప్యాలెస్, ఓవల్ మైదాన్,...ఇలా ఎన్నో ప్రాంతాలు ఎన్నో అనుభవాలను మిగిల్చాయి...
undefined
‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌తో పాటు రాహుల్ ద్రావిడ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, లీసా స్టేల్కర్‌ వంటి మాజీ క్రికెటర్ల ఇంటర్వ్యూలను తన డాక్యుమెంటరీలో చేర్చిన స్టీవ్ వా... వీడియోకి ఇండియన్ కామెంటేటర్ హర్షా భోగ్లేతో వాయిస్ ఓవర్ ఇప్పించాడు...
undefined
click me!