నిజం చెప్పవయ్యా అఫ్రిదీ... నీ వయసెంత? 41, 40, 45, 44... ఒక్కోసారి ఒక్కోలా...

First Published Mar 2, 2021, 11:30 AM IST

పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో ప్లేయర్ల వయసు గురించి చాలా పెద్ద చర్చే జరిగింది. రికార్డుల ప్రకారం 17 ఏళ్లు అని చూపించే ప్లేయర్ల వయసు, 27 ఏళ్ల పైనే ఉంటుందని షాకింగ్ విషయాలు వెల్లడించాడు పాక్ మాజీ ప్లేయర్ డానిష్ కనేరియా. తాజాగా పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ వయసు విషయంలో కూడా ఇప్పటికీ ఓ క్లారిటీ వచ్చి చావడం లేదు...

షాహిద్ అఫ్రిదీ పుట్టినతేదీ ఫిబ్రవరి 28... అయితే ఏడాది విషయంలో మాత్రం అతనికి కూడా క్లారిటీ లేదు. పాక్ సూపర్ లీగ్ ప్రకారం అఫ్రిదీ వయసు 40 ఏళ్లు, వీకిపీడియా రికార్డుల ప్రకారం 41 ఏళ్లు... అఫ్రిదీ గారి ఆటోబయోగ్రఫీ ప్రకారం చూస్తే 46,... ఇన్ని చాలనట్టు ఇప్పుడు ఈ ప్లేయర్ల వేసిన ట్వీట్‌లో నాకు 44 ఏళ్లు అని చెప్పుకొచ్చాడు.
undefined
అంతర్జాతీయ వన్డేల్లో ఐదు సెంచరీలు, ఐదేసిసార్లు ఐదు వికెట్లు తీసిన ఒకే ఒక్క ప్లేయర్ షాహిద్ అఫ్రిదీ... అంతేకాదు ఐపీఎల్, పీఎస్‌ఎల్, బీబీఎల్, ఎల్‌పీఎల్ (లంక ప్రీమియర్ లీగ్), టీ20 వరల్డ్‌కప్... ఇలా అన్ని టీ20 టోర్నీల్లో డకౌట్ అయిన ఒకే ఒక్క ప్లేయర్ అఫ్రిదీ...
undefined
పాక్ జట్టులో చోటు దక్కించుకున్నప్పుడు తన వయసు 16 ఏళ్లని రికార్డుల్లో చూపించాడు షాహిద్ అఫ్రిదీ... 1996లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 37 బంతుల్లో సెంచరీ సాధించి, సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేశాడు. అయితే అప్పుడే అఫ్రిదీ వయసుపైన పెద్ద చర్చే జరిగింది...
undefined
అఫ్రిదీ వయసు 21 ఏళ్లకు పైనే ఉంటుందని ఆరోపణలు వచ్చాయి. అయితే రికార్డుల కోసం ఆ విషయాన్ని దాచిపెట్టిన అఫ్రిదీ, క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆటోబయోగ్రఫీగా విడుదల చేసిన ‘గేమ్ ఛేంజర్’లో తన వయసు 1996లో 21 ఏళ్లని చెప్పాడు...
undefined
తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసిన అఫ్రిదీ... ‘నా 44వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినవారందరికీ ధన్యవాదాలు. నా కుటుంబం, నా అభిమానులే నాకు పెద్ద ఆస్తి...’ అంటూ ట్వీట్ చేశాడు...
undefined
1996లో 21 ఏళ్లంటే, 2021కి 46 ఏళ్లు ఉండాలి. కానీ తన వయసు కేవలం 44 ఏళ్లే అంటున్నాడు షాహిద్ అఫ్రిదీ. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీలో నిలిచిన షాహిద్ అఫ్రిదీ వన్డేల్లో 351 సిక్సర్లు బాది, అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు...
undefined
నాలుగు సార్లు క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన షాహిద్ అఫ్రిదీ, మొత్తంగా తన కెరీర్‌లో 11,196 పరుగులు, 541 వికెట్లు పడగొట్టాడు.
undefined
click me!