విరాట్ కోహ్లీతో పోటీపడలేను, అతను నాకంటే చాలా చాలా... ఫాఫ్ డుప్లిసిస్ కామెంట్...

Published : Nov 26, 2022, 05:36 PM IST

టీమిండియా కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లోనూ ఆర్‌సీబీకి టైటిల్ అందించలేకపోయాడు. 9 సీజన్లలో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ, 2016 సీజన్‌లో బ్యాటర్‌ 973 పరుగులు చేసి సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేర్చగలిగినా టైటిల్ మాత్రం అందించలేకపోయాడు...

PREV
16
విరాట్ కోహ్లీతో పోటీపడలేను, అతను నాకంటే చాలా చాలా... ఫాఫ్ డుప్లిసిస్ కామెంట్...

విరాట్ కోహ్లీ 2021 ఐపీఎల్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం ప్రకటించిన కొన్ని రోజులకే ఆర్‌సీబీ కెప్టెన్‌గానూ ఇదే ఆఖరి సీజన్ అంటూ ప్రకటించాడు..

26
Virat Kohli, Faf du Plessis

ఏబీ డివిల్లియర్స్ ఆడిన ఆఖరి సీజన్, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చివరి సీజన్ కూడా ఒకటే. విరాట్ కోహ్లీ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును నడిపించే బాధ్యత సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లిసిస్‌కి దక్కింది...

36

‘విరాట్ కోహ్లీ వయసులో నాకంటే చిన్నవాడు కావచ్చు, కానీ మెచ్యూరిటీలో నాకంటే చాలా చాలా పెద్దోడు. అతనితో పోటీపడాలని ప్రయత్నించడం కూడా సాహసమే అవుతుంది. సాధారణంగా ఈగో కారణంగానే నెమళ్లు కొట్టుకుంటాయి... అలా గొడవ పడితే వాటి ఈకలు ఊడిపోతాయి..

46

ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్ కూడా అలాంటిదే. అయితే ఎంత పెద్ద స్టార్ ప్లేయర్లు ఉన్నా... ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. మాలో ఎవరు బెస్ట్? అనే చర్చ ఎప్పుడూ రాదు... ఇలాంటి ప్లేయర్లతో గడిపే అవకాశం దక్కడం నా లక్...

56
Image credit: PTI

విరాట్ కోహ్లీతో నా రిలేషన్ చాలా స్పెషల్. అతనితో నాకు ఎప్పటి నుంచే పరిచయం ఉంది. వరల్డ్ క్రికెట్‌లో విరాట్‌తో పోటీపడేందుకు అందరూ ఇష్టపడతారు. అతనిలో ఇంత ఎనర్జీ ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు...

66

మొదటి వికెట్ పడ్డప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుందో 11వ వికెట్ పడ్డప్పుడు కూడా విరాట్ కోహ్లీలో అంతే ఎనర్జీ ఉంటుంది. అతని చుట్టూ వారిలో ఆ ఎనర్జీ నింపుతాడు... నా వరకూ అతనో సూపర్ మ్యాన్...’ అంటూ చెప్పుకొచ్చాడు ఫాఫ్ డుప్లిసిస్.. 

Read more Photos on
click me!

Recommended Stories