మేం ఆడకపోతే వరల్డ్ కప్ ఎవరు చూస్తారు... పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా కామెంట్...

First Published Nov 26, 2022, 5:18 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో మొట్టమొదటిసారిగా ఐసీసీ టోర్నీల్లో టీమిండియాపై విజయం అందుకుంది పాకిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా చేతుల్లో పాక్ చిత్తుగా ఓడినా గత ఏడాది విజయం చూసి తెగ మురిసిపోతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు...

ఆసియా కప్ 2023 టోర్నీకి పాకిస్తాన్ వేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో టీమిండియా, పాక్‌లో పర్యటిస్తుందా? అనేది హాట్ టాపిక్ అయ్యింది...

భారత జట్టు పాక్‌లో అడుగుపెట్టేది లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశాడు. దీంతో పాక్ క్రికెట్ బోర్డు హడావుడి చేస్తోంది. భారత జట్టు, ఆసియా కప్ 2023 టోర్నీ కోసం పాకిస్తాన్‌కి రాకపోతే, తాము వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీకి రాబోమని తెలిపింది...

ఇంతటితో ఆగకుండా పాక్ రాకపోతే వన్డే వరల్డ్ కప్ మ్యాచులను ఎవ్వరూ చూడరని ప్రగల్భాలు పలుకుతోంది పీసీబీ. ‘ఆసియా కప్ 2023 టోర్నీ పాక్‌లోనే జరుగుతుంది. ఒకవేళ పాక్ నుంచి ఆసియా కప్‌ని వేరే వేదికకు మారిస్తే... మేం వన్డే వరల్డ్ కప్ ఆడబోం. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. మేం రాకపోతే వన్డే వరల్డ్ కప్ మ్యాచులను ఎవరు చూస్తారు...’ అంటూ వ్యాఖ్యానించాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...

India vs Pakistan Last Over

ఇండియా, పాకిస్తాన్ మ్యాచులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి రికార్డు స్థాయిలో 90వేలకు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌కి రికార్డు స్థాయిలో రియల్ టైం 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయి...

అయితే ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌కి కూడా 82 వేలకు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు అభిమానులు. పాకిస్తాన్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, అది భారత జట్టు ఫాలోయింగ్‌తో పోలిస్తే చాలా తక్కువ. అది అందరికీ తెలుసు, అయినా పాక్ లేకపోతే వరల్డ్ కప్ మ్యాచులు చూడరని రమీజ్ రాజా చేస్తున్న వ్యాఖ్యలు హ్యాస్యాస్పదంగా ఉన్నాయని అంటున్నారు టీమిండియా అభిమానులు.. 

click me!