హార్ధిక్ పాండ్యా రీఎంట్రీ ఇవ్వకుంటే... టీ20 వరల్డ్ కప్ ఆడేవాడిని! వెంకటేశ్ అయ్యర్ కామెంట్స్...

First Published Nov 26, 2022, 1:52 PM IST

సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి వంటి ప్లేయర్లు టీమిండియాలోకి రావడానికి ఎన్నో సీజన్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. రాహుల్ త్రిపాఠి అయితే ఇప్పటికీ అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. అయితే అర సీజన్ ఆటతో సెలక్టర్లను ఇంప్రెస్ చేసి టీమిండియాలోకి వచ్చేశాడు వెంకటేశ్ అయ్యర్. ఎంత త్వరగా జట్టులోకి వచ్చాడో, అంతే వేగంగా టీమ్‌లో చోటు కోల్పోయాడు...

ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్‌లో కేకేఆర్ జట్టుకి ఓపెనర్‌గా మారిన వెంకటేశ్ అయ్యర్... 4 హాఫ్ సెంచరీలతో 380 పరుగులు చేసి అదరగొట్టాడు. ఫస్ట్ ఫేజ్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కేకేఆర్, సెకండ్ ఫేజ్‌లో వరుస విజయాలు అందుకుని ఫైనల్ చేరిందంటే అయ్యర్ ఆటే కారణం...

ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రీఫీల్లోనూ మెప్పించిన వెంకటేశ్ అయ్యర్... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. హార్ధిక్ పాండ్యా ప్లేస్‌లో ఆల్‌రౌండర్‌గా 2 వన్డేలు, 9 టీ20 మ్యాచులు ఆడాడు అయ్యర్...

venkatesh Iyer, Hardik Pandya

హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడంతో వెంకటేశ్ అయ్యర్, కొన్ని మ్యాచులకు రిజర్వు బెంచ్‌కి పరిమితమై... ఆ తర్వాత మాయమైపోయాడు. తాజాగా పాండ్యాపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వెంకటేశ్ అయ్యర్...

‘టీమిండియాలో సుదీర్ఘకాలం ఉండాలని ఎవరు మాత్రం అనుకోరు. నేను కూడా కొన్నేళ్ల పాటు జట్టులో ఉండాలనే అనుకున్నాను. అయితే హార్ధిక్ పాండ్యా రీఎంట్రీ తర్వాత సీన్ మారిపోయింది. పాండ్యా ఎంట్రీతో నాకు టీ20 వరల్డ్ కప్ జట్టులో ప్లేస్ ఉండదని అర్థమైపోయింది...

హార్ధిక్ పాండ్యా అద్భుతంగా ఆడాడు. టీమిండియాకి కీ ప్లేయర్.. అలాంటి ప్లేయర్ ఉండాలని ఏ టీమ్‌ అయినా కోరుకుంటుంది. నేను జట్టులో ఉండాలనుకున్నాను, అయితే అన్నీ మన చేతుల్లో ఉండవు కదా.. భారత జట్టుకి ఆడకపోయినా ఐపీఎల్‌లో, దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నాను...

Venkatesh Iyer

ఏ జట్టుకి ఆడినా సెలక్షన్ గురించి దిగులు పడకుండా నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో నాకు ప్లేస్ దక్కకపోవడానికి గాయం కూడా కారణం. ఇప్పుడైతే నాకు దేని గురించి బాధలేదు. నా టైం వచ్చినప్పుడు నన్ను నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా...’ అంటూ కామెంట్ చేశాడు వెంకటేశ్ అయ్యర్...

click me!